ఐపీఎల్ : 13 మంది కెప్టెన్లు.. మారారు.. అయినా ఏం లాభం?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక నిలకడైన జట్టుగా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 13 సీజన్స్ ఆడగా అందులో 11 సీజన్ల లో ప్లే ఆఫ్ కి చేరుకోవడం గమనించాల్సిన విషయం. ఇక ఇందులో నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచి తమ సత్తా ఏంటో చూపించింది. కేవలం రెండుసార్లు మాత్రమే లీగ్ దశలో వెనుదిరిగింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక 2016 2017 సీజన్స్ లో నిషేధం విధించిన కారణంగా టోర్నీలో పాల్గొనలేకపోయింది. ఇక ఇలా చెన్నై సూపర్ కింగ్స్ అత్యుత్తమ జట్టుగా కొనసాగుతుండగా పరమ చెత్త టీం గా కొనసాగుతున్న జట్టు పంజాబ్ కింగ్స్.
2008 నుంచి పంజాబ్ కింగ్స్ పంజాబ్ ఎలేవన్ అనే పేరుతో ఆడుతుండగా ఇప్పటి వరకు అతి చిత్త ప్రదర్శనతో ఏమి సాధించని జట్టుగా మిగిలిపోయింది. సీజన్ సీజన్ కి కెప్టెన్ మారుస్తూ 13 మంది కెప్టెన్ లని మాత్ర రికార్డు కూడా సంపాదించింది. యువరాజ్ సింగ్ తో మొదలైన పంజాబ్ కింగ్స్ ప్రయాణం ప్రస్తుతం శిఖర్ ధావన్ క్యాప్టెన్సి లో కొనసాగుతోంది. ప్రస్తుతం 14వ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు శిఖర్ ధావన్. ఎంతమంది వచ్చినా జట్టు తలరాత మారడం లేదు యువరాజ్ సింగ్, జార్జ్ బెయి, సెహ్వాగ్, డేవిడ్ మిల్లర్, మురళి విజయ్, జయవర్ధనే, డేవిడ్ హస్సి, గిల్ క్రిస్ట్, కుమార సంగక్కార, మయాంక్ అగర్వాల్, అశ్విన్, కెఎల్ రాహుల్, మాక్స్ వెల్ జట్టుకు కెప్టెన్ గా పని చేశారు.
యువరాజ్ సింగ్ నేతృత్వంలో మొదటి సారి సెమీస్ కి చేరిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత జార్జ్ బెయిలి నాయకత్వంలో ఫైనల్ వరకు చేరింది. కేవలం ఈ రెండు సీజన్స్ లో మాత్రమే పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన చేయగా మిగతా సీజన్స్ మొత్తం కూడా ఆఖరి స్థానం కోసం పోటీ పడుతుంది. ఇక ఇప్పుడు 2023 సీజన్ లో మొదటి ఆట లో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ మంచి జోష్ లో ఉంది మరి ఇదే ఉత్సాహంతో మిగతా మ్యాచ్ లు గెలిచి తన స్థానాన్ని ఏ మేరకు మెరుగు పరుచుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: