ముఖేష్ అంబానీ ప్లాన్ సూపర్ సక్సెస్.. అది ఐపీఎల్ క్రేజ్ అంటే?

praveen
ప్రస్తుతం భారత్లో అపర కుబేరుడిగా అందరూ పిలుచుకునే  ముఖేష్ అంబానీ ప్రతి విషయం లో ఎంత మాస్టర్ మైండ్ తో ప్లాన్లు వేస్తూ ఉంటాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఇక అంత మాస్టర్ మైండ్ ఉంది కాబట్టి అన్ని వ్యాపారాల్లో కూడా సక్సెస్ సాధిస్తూ తన సంపదను అంతకంతకు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు అంబానీ. ఇక ఒక్కసారి అంబానీ ఒక ప్లాన్ వేశారంటే అది సక్సెస్ కాకుండా ఉండదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు అంబానీ వేసిన మరో ప్లాన్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.

 ఊహించిన దానికంటే ఎక్కువగా ఇప్పుడు అంబానీ లాభ పడ్డాడు అని చెప్పాలి. ఇటీవలే ఐపిఎల్ 2023 ప్రారంభమైంది. ఐపీఎల్ మొదలైంది అంటే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ స్టేడియం కు వెళ్లలేరు. అలా అని టీవీ ముందు కూర్చోలేరు. ఇక ఆఫీసులకు వెళ్లినవారు మొబైల్ లో లైవ్ లో మ్యాచ్ వీక్షించాలని అనుకుంటారు. ఈ క్రమం లోనే  కొంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా  ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

 ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండానే జియో సినిమా డౌన్లోడ్ చేసి ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు అవకాశం కల్పించాడు. ఇంకేముంది ఉచితం అనే మాట వినిపిస్తే చాలు ఆ అవకాశాన్ని వాడుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. దీంతో ఇక జియో సినిమా యాప్ ను కేవలం గంటల వ్యవధి లనే 2.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో భారత్ లో ఒక్క రోజు లోనే అత్యధికం గా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న యాప్ గా జియో సినిమా రికార్డు సృష్టించింది. దీంతో ఇక ముఖేష్ అంబానీ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: