పొలిటికల్ ఎంట్రీపై.. క్లారిటీ ఇచ్చేసిన శిఖర్ ధావన్?

praveen
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవల కాలం లో ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఒకప్పుడు అద్భుతమైన ప్రదర్శనలు చేసి వార్తల్లో ఎక్కువగా కనిపించిన శిఖర్ ధావన్ పేరు ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అతను ఇస్తున్న స్టేట్మెంట్ల ద్వారా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సాధారణంగానే మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే అటు శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఎప్పుడు ఏదో ఒక ఆసక్తికర పోస్టు పెట్టడం అభిమానులను అలరించడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సారధ్యం వహించే చాన్స్ కూడా కొట్టేశాడు అని చెప్పాలి  ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇక సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాడు. ఇకపోతే ఇటీవల శిఖర్ ధావన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇక తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వస్తాను. 100% కష్టపడి పని చేస్తాను అంటూ శిఖర్ ధావన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి. దీంతో శిఖర్ ధావన్ ఏదైనా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడా... లేకపోతే ఏదైనా పార్టీతో టచ్ లో ఉన్నాడా అన్న చర్చ మొదలైంది అని చెప్పాలి. అయితే ఆ తర్వాత మరిన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే ప్లాన్స్ ఏమీ లేవని.. కానీ నేను రాజకీయాల్లోకి రావడం దేవుడు చిత్తమైతే తప్పకుండా వస్తాను అంటూ చెప్పాడు శిఖర్ ధావన్. కాగా ప్రస్తుతం తన కెప్టెన్సీలో పంజాబ్ జట్టుకి కప్ అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: