అలా చేశాక.. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నా : దావన్

praveen
భారత జట్టులో సీనియర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు శిఖర్ ధావన్. ఇక ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఎన్నోసార్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు సీనియర్ అనే పేరుతో అతని పక్కన పెడుతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం సీనియర్లను పక్కనపెట్టి మరి శిఖర్ ధావన్ కు జట్టులో చోటు కల్పించారు అని చెప్పాలి. ఓపెనర్గా శిఖర్ ధావన్ సృష్టించిన రికార్డులు కూడా అన్ని ఇన్ని కావు.

 అయితే మొన్నటి వరకు టెస్ట్ టి 20 ఫార్మాట్లకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్ ఇక వన్డే ఫార్మాట్లో మాత్రం కీలక ఆటగాడిగా కొనసాగాడు. అంతేకాకుండా ఇక రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో ఏకంగా కెప్టెన్ గా కూడా సత్తా చాటాడు అని చెప్పాలి. ఏకంగా శిఖర్ ధావన్ కెప్టెన్సీ లో అటు టీమిండియా వరుసగా సిరీస్ లు గెలిచింది. అయితే కేవలం ఆటలో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటాడు ఈ క్రికెటర్. ఎప్పుడు తనదైన శైలిలో పోస్టులు పెడుతూ ఇక అభిమానులను అలరిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అందుకే శిఖర్ ధావన్ ఏదైనా పోస్ట్ పెట్టాడంటే చాలు అది చూసి తెగ ఆనంద పడిపోతూ ఉంటారు.

 ఇకపోతే ఇటీవలే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శిఖర్ ధావన్. అయితే శిఖర్ ధావన్ శరీరంపై పలుచోట్ల టాటూలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే 15 ఏళ్ల క్రితం మనాలి టూర్కు వెళ్ళినప్పుడు అక్కడ టాటూలు వేయించుకున్నట్లు ఇటీవల గుర్తు చేసుకున్నాడు. అయితే టాటూ వేయించుకున్న తర్వాత హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాడట శిఖర్ ధావన్. ఎందుకంటే ఒకరికి వేసిన టాటూ సూదితోనే మరొకరికి వేస్తారని తెలిసి భయపడ్డాను. నాలుగు నెలల తర్వాత హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకున్నాను. కానీ నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న అంటూ అటు శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: