నేడే ఫైనల్... ఫస్ట్ WPL టైటిల్ కోసం హోరా హోరీ తప్పదా ?

VAMSI
ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన రోజు నుండి క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చేశాయి. గత 23 రోజుల నుండి ఇండియా  వేదికగా మహిళల పొట్టి ఫార్మాట్ టీ 20 లీగ్ మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 1 జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజుల పాటు క్రికెట్ మజాను అందించిన ఈ లీగ్ నేడు ముంబై వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. ఈ లీగ్ లో పాల్గొన్న అయిదు జట్ల నుండి రెండు జట్లు (ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్) ఉత్తమ ప్రదర్శనను కనబరిచి ఫైనల్ కు చేరుకున్నారు.

ఈ రోజు సాయంత్రం ఈ రెండు జట్ల మధ్యన మెగా ఫైనల్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లలో ఏ జట్టు మొదటి టైటిల్ ను సొంతం చేసుకోనుంది అన్న విషయం ఇప్పుడు చర్చల్లో ఉంది. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కానీ మ్యాచ్ రోజున ఎవరు ఎలా ఆడుతారు అనే దానిపైనే విజయావకాశాలు ఉంటాయి. ముంబై మరియు ఢిల్లీ కెప్టెన్ లుగా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ మరియు మెగ్ లానింగ్ లు ఇద్దరూ కూడా అటు బ్యాటింగ్ లోనూ ఇటు టీం ను సమర్ధవంతంగా విజయపధంలో నడిపిస్తున్నారు. ఇక మెగ్ లానింగ్ అయితే లీగ్ లో టాప్ స్కోరర్ గా ఉంది.  
హర్మన్ ప్రీత్ కౌర్ జట్టుకు అవసరం అయిన సమయంలో తనదైన బ్యాటింగ్ తో ఆదుకుంటోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు విన్నింగ్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఎక్కువ పరుగులు చేసి ప్రత్యర్థి ముందుబ గట్టి టార్గెట్ ఇచ్చి ఒత్తిడి తేవడానికి టాస్ గెలిచిన జట్టు ప్రయత్నిస్తుంది. ముంబై లో కీలక ప్లేయర్ లుగా హర్మన్ , భాటియా , హీలీ మాథ్యూస్, నటాలీ సీవర్, అమీలియా ఖర్, పూజ వస్త్రకారు, ఇస్సీ వాంగ్ ,మరియు సైకా ఇషాక్ లు ఉన్నారు. అదే విధంగా ఢిల్లీ లో తీసుకుంటే లానింగ్ , షెఫాలీ వర్మ, క్యాప్సి , రోడ్రిగస్ , కప్ , జోనసేన్, నోరిస్ లు కీలకం కానున్నారు. మరి బీసీసీన్ మొదలు పెట్టిన మహిళల ప్రీమియర్ లీగ్ లో మొదటి సీజన్ టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారు అన్నది చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: