రోహిత్ సెంచరీతో మొదలు పెడితే.. కోహ్లీ శతకంతో ముగించాడు?

praveen
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా మరోసారి సత్తా చాటింది అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచిన టీమ్ ఇండియా ఇక మూడో మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ నాలుగో మ్యాచ్ డ్రాగా ముగించుకుంది. దీంతో 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది అని చెప్పాలి.. అదే సమయంలో ఇక న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడం కారణంగా ఎలాంటి సమీకరణలు లేకుండానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అడుగుపెట్టింది టీం ఇండియా. ఈ క్రమంలోనే ఇక ఈసారి విశ్వవిజేతగా టీమిండియా నిలవాలని భారత అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి. అయితే నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడం గురించి టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.

 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ఈరోజు భోజనం విరామం తర్వాత అర్హత సాధించాం. అప్పటినుంచి మా కుర్రాళ్లను కష్టపెట్టను అని ఫిక్స్ అయ్యాను. ముందు ఈ సిరీస్ విజయాన్ని వేడుక చేసుకుందాం అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. డబ్ల్యూటీసి ఫైనల్ ఆడటం అంటే ఒక అతిపెద్ద సవాలు లాంటిది. ఐపీఎల్ ఫైనల్,  డబ్ల్యూటీసి ఫైనల్ మధ్య కేవలం వారం రోజుల విరామం మాత్రమే ఉంది. ఇక లాజిస్టిక్స్ పరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ద్రావిడ్ తెలిపాడు. క్లిష్ట సమయంలో కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారు అంటూ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు.

 ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ ను అటు రోహిత్ శర్మ సెంచరీ తో మొదలుపెడితే చివరి టెస్ట్ మ్యాచ్ ను విరాట్ కోహ్లీ సెంచరీ తో ముగించాడు అంటూ ప్రశంసలు కురిపించాడు రాహుల్ ద్రావిడ్. ఇక మధ్యలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ శుభమన్ గిల్ కూడా రాణించారు. అయితే నేను కొన్నింటిని వదిలేసి ఉండొచ్చు కానీ ఏదేమైనా మేము పోరాడి గెలిచాం అంటూ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ముఖ్యంగా గత కొంత కాలం నుంచి తన  ప్రదర్శనలతో అందరిలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు గిల్. ప్రతి సందర్భంలోనూ జట్టుకు నేనున్నాను అంటూ నిలబడుతున్నాడు. పరిణితి కనబరుస్తున్నాడు. ఇది మాకు శుభ సూచకం అంటూ రాహుల్ ద్రవిడు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: