ఆమె వల్లే.. నా జీవితం ఇలా మారింది : కోహ్లీ
ఇకపోతే ఇటీవలే అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం కూడా ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాడ్ కాస్ట్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ క్రమంలోనే కోహ్లీని ఆసక్తికర ప్రశ్నలు అడిగి ఇక అతను కెరియర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని విషయాలను అభిమానులకు తెలియజేసింది రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు యాజమాన్యం. కాగా ఐపీఎల్ మొదలైన నాటి నుంచి బెంగళూరు జట్టు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ ఇక సారథ్యం నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం డూప్లెసెస్ సారధిగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనె రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పాడ్ కాస్ట్ లో మాట్లాడిన కోహ్లీ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన తండ్రి దూరమైన ఘటన తన భవిష్యత్తుపై ఉన్న ఆలోచన ధోరణిలో ఎంతగానో మార్పు తీసుకువచ్చింది అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత తన భార్య అనుష్క శర్మతో పరిచయం తన జీవితాన్ని మొత్తం మార్చేసింది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆమె కలిసిన క్షణాన్ని నా లైఫ్ చేంజింగ్ మూమెంట్గా చెబుతాను. ఇక మీరు ప్రేమలో పడినప్పుడు ఆ మార్పులు మీలో కూడా వస్తాయి. భవిష్యత్తులో ఇద్దరు కలిసి ప్రయాణించాలి కాబట్టి అందుకు తగ్గట్లుగా మార్పు మొదలవుతుంది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.