షమి బౌలింగ్ లో.. కోహ్లీ, రోహిత్ కూడా ఇబ్బంది పడతారు?
అయితే ఇక ఈ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చి ఇక్కడ భారతి జట్టుతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇక భారత జట్టులో భాగమైన సీనియర్ బౌలర్ షమి తన బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక ఇటీవల కాలంలో యువ ఆటగాళ్ల పోటీని తట్టుకుంటూ ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా నిరూపించుకుంటున్నాడు మహమ్మద్ షమీ. కాగా అతని పై వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు అని చెప్పాలి.
ప్రస్తుతం టీమిండియా లో అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సైతం మహమ్మద్ షమీ బౌలింగ్ లో ఆడటానికి ఎంతో ఇబ్బంది పడతారు అంటూ దినేష్ కార్తీక్ చెప్పకు వచ్చాడు. నెట్ ప్రాక్టీస్ సమయం లో తన కెరీర్లో తాను ఎదురుకున్న అత్యంత కఠినమైన బౌలర్ షమీ అంటూ చెప్పు కొచ్చాడు. నెట్ ప్రాక్టీస్ లో అతని బౌలింగ్లో ఆడటం టార్చర్ అంటూ తెలిపాడు. ఇక కోహ్లీ రోహిత్ శర్మ సైతం అతని బౌలింగ్ లో ఆడటానికి ఇబ్బంది పడతారు అంటూ మహమ్మద్ షమి ప్రదర్శన పై ప్రశంసలు కురిపించాడు.