కోహ్లీ కోసం.. రిస్క్ చేసిన అభిమాని.. మైదానంలోకి వెళ్లి?

praveen
సాధారణంగా భారత్లో క్రికెటర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ క్రికెటర్లను ఏకంగా ఆరాధ్య దైవంగా కూడా అభిమానిస్తూ ఉంటారు ఎంతోమంది ఫ్యాన్స్. ఈ క్రమంలోనే  తమ అభిమాన క్రికెటర్ల ను ఒక్కసారి కలిసిన చాలు అని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారో అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఎక్కడైనా తమ అభిమాన క్రికెటర్ కనిపించాడు అంటే చాలా ఒక్క సెల్ఫీ తీసుకోవడానికి అభిమానులు చేసే ప్రయత్నాలు అన్నీ కావు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక తమ అభిమాన క్రికెటర్లను కలవడానికి ఫాన్స్ కాస్త రిస్క్ చేయడానికి కూడా వెనకడరు అని చెప్పాలి.


 సాధారణంగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మైదానంలోకి దూసుకు రాకుండా ఉండడానికి స్టేడియం చుట్టూ ఎంతోమంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు అభిమానులు మాత్రం కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఏకంగా స్టేడియంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని తమ అభిమాన క్రికెటర్లను కలిసేందుకు మైదానంలోకి దూసుకు రావడం లాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నోసార్లు జరిగాయి. ఇక కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి తరహా ఘటనలు కాస్త తగ్గుముఖం పట్టాయి అని చెప్పాలి. ఇకపోతే శ్రీలంకతో భారత్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. కేవలం సెంచరీ చేయడం కాదు 166 పరుగులతో చెలరేగిపోయాడు అయితే తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్లో ఒక అభిమాని ఏకంగా గ్రౌండ్లోకి దూసుకు వెళ్ళాడు. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి కోహ్లీ కాళ్లు మొక్కాడు. సడన్గా అభిమాని పరిగెత్తుకుంటూ రావడంతో షాక్ అయినా కోహ్లీ అతడిని లేవదీశాడు. ఈ ఫోటో ఫాన్స్ ని తెగ ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా తన వన్ డే కెరియర్లో 46వ సెంచరీని నమోదు చేశాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: