ఇక బిసిసిఐతో.. బంధం తగ్గిపోయినట్లే : మురళి విజయ్
ఇక కొంతమంది ఆటగాళ్లు అయితే ఎన్నో ఏళ్ల పాటు భారత్ జట్టులో చోటు కోసం నిరీక్షణగా ఎదురు చూసి చివరికి భారత సెలక్టర్లు కరుణించకపోవడంతో విసుగు చెంది తమ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక మరికొంతమంది భారత క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ఇక బీసీసీఐ తో ఉన్న అన్ని సంబంధాలను తెలుసుకొని విదేశీ క్రికెట్లో ఆడటానికి కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు భారత క్రికెట్ లో వెటరన్ ప్లేయర్ గా కొనసాగుతున్న మురళి విజయ్ సైతం ఇక ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలితో ఉన్న తన బంధం ఇక ముగిసినట్లే అంటూ సీనియర్ ఆటగాడు మురళి విజయ్ చెప్పుకొచ్చాడు. విదేశాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇండియాలో 30 ఏళ్లు దాటిన వారిపై వివక్ష చూపిస్తున్నారని.. 80 ఏళ్ల వృద్ధిడిగా పరిగణిస్తున్నారు అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మన చేతిలో లేని వాటిని మనం నియంత్రించలేం.. ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు కాగా 38 ఏళ్ళ మురళి విజయ్ భారత తరఫున 61టెస్టులు 7 వన్డే మ్యాచ్లు ఆడాడు. 2018లో చివరిసారిగా భారత్ తరపున ఆడగా అప్పటినుంచి జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు.