ఇన్నింగ్స్ గొప్పగా ఏం లేదు.. కానీ అద్భుతంగా ఆడాడు?

praveen
టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ గత కొంతకాలం నుంచి వరుస వైఫల్యాలతో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోహిత్ శర్మకు జోడిగా ఓపెనర్ గా బరిలోకి దిగే రాహుల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక పేలవమైన ప్రదర్శన కారణంగా తీవ్ర స్థాయిలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఇక ఇలాంటి వరుస వైఫల్యాలు కారణంగానే అతని స్థానం జట్టులో ఉంటుందా ఊడుతుందా కూడా గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

 మొన్నటి వరకు కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా కొనసాగిన కేఎల్ రాహుల్ ఇక ఇప్పుడు మాత్రం వైస్ కెప్టెన్సీ ని కూడా కోల్పోయాడు. అదే సమయంలో ఇక ఓపెనర్ స్థానం నుంచి చివరికి మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం వరకు అతని పరిస్థితి దిగజారింది అని చెప్పాలి. ఇకపోతే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే శ్రీలంకతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో కూడా ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి కేవలం 215 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అయితే లక్ష్యం చిన్నది అయినప్పటికీ టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఇక టీమిండియా కష్టాల్లో పడిపోయింది.

 ఇలాంటి సమయంలోనే ఇక ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కేఎల్ రాహుల్ ఎంతో నిలకడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఎక్కడ అగ్ర సేవ్ బ్యాటింగ్ చేయకుండా ఆచితూచి  ఆడుతూ పరుగులు రాబట్టాడు. 13 బంతులు ఎదుర్కొని 64 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇలా జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే అతని ఆట తీరుపై మాజీ ఆటగాడు మహమ్మద్ ప్రశంసలు కురిపించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కె.ఎల్ రాహుల్ ఆచితూచి ఆడాడు. రాహుల్ బ్యాటింగ్ అతని అనుభవానికి అద్ధం పట్టింది. అతని ఇన్నింగ్స్ గొప్పగా ఏమీ లేదు. అయితే కేఎల్ రాహుల్ ఇప్పుడు పరిమితి చెందిన బ్యాటర్ అంటే ఎలా ఉండాలో తన ఆట తీరుతో చూపించాడు అంటూ మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: