సంజు శాంసన్ కు టీమిండియాలో ఛాన్స్.. అయినా భయపడుతున్న ఫ్యాన్స్?

praveen
సంజు శాంసన్.. నేటితరం క్రికెటర్లలో అతను కూడా ఒక టాలెంట్ ఉన్న క్రికెటర్. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చెబుతూ ఉంటారు కదా ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి లేకపోతే అవకాశాలు దొరకడం చాలా కష్టమని. ఇక క్రికెట్లో అట్లు సంజు శాంసన్ విషయంలో ఇది నిజమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. ఎందుకంటే అతనికి ఎంతో టాలెంట్ ఉంది. మిడిల్ ఆర్డర్లోనే కాదు ఓపెనర్ గా కూడా బాగా రాణించగలడు. ఇక ఇటీవల కాలంలో అయితే ఎంతో నిలకడగా కూడా ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇక అతనిలో ఉన్న కీపింగ్ నైపుణ్యం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇక ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు సారథిగా వ్యవహరించిన అనుభవం కూడా అతనికి ఉంది. అయితే ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ అతనికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. అదృష్టం కలిసి రావడం లేదు అనేకంటే బీసీసీఐ సెలెక్టర్లు అతని పట్ల వివాక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనడమే మంచిదేమో  అనిపిస్తూ ఉంటుంది అతని అట్ల బీసీసీఐ వ్యవహరించే తీరు చూస్తూ ఉంటే. ఎందుకంటే అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపేడుతున్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్న బీసీసీఐ సెలక్టర్లు సంజు శాంసన్ విషయంలో మాత్రం ఎప్పుడు వివాక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఎంతో అనుభవం టాలెంట్ ఉన్నప్పటికీ సంజు శాంసన్ కు అటు టీమ్ ఇండియాలో అవకాశం కోసం నిరీక్షణగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ఎన్నో  రోజులనిరీక్షణ తర్వాత ఇటీవల శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ లో సంజు శాంసన్ కు అవకాశం కల్పించారు భారత సెలక్టర్లు. దీంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే గతంలో కూడా ఇలా జట్టులో ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో మాత్రం చాన్స్ కల్పించలేదు. మరి ఇప్పుడైనా సంజు శాంసన్ కు తుది జట్టులో అవకాశం వస్తుందో లేదో అని ఫాన్స్ లో ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: