అప్పుడు 11.50 కోట్లు.. కానీ ఇప్పుడు 50 లక్షలే.. పాపం స్టార్ ప్లేయర్?

praveen
బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా ఊహకంగా విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒకప్పుడు కోట్ల రూపాయలు కొల్లగొట్టి భారీ ధర పలికిన ఆటగాళ్లు ఆ తర్వాత సీజన్లోనే అమ్ముడుపోని ఆటగాళ్లుగా మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారిని సైతం కొనుగోలు చేసేందుకు అటు ఫ్రాంచైజీలు  ముందుకు రాని పరిస్థితి కూడా కొన్ని కొన్ని సార్లు ఏర్పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ ధర పలుకుతుంది అనుకున్న ఆటగాళ్లకు చివరికి నిరాశ ఎదురవుతూ ఉంటుంది అని చెప్పాలి

 కాగా 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి కొచ్చి వేదికగా మినీ వేలం ప్రక్రియ జరగ్గా.. ఇందులో కూడా ఎంతో మంది ఆటగాళ్లకు నిరాశ ఎదురయింది అని చెప్పాలి. ఒకప్పుడు రికార్డు స్థాయిలో ధర పలికిన ఆటగాళ్లను కనీసం బేస్ ప్రైస్ కి కూడా కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇలా తక్కువ ధరకు అమ్ముడుపోయి అందరిని ఆశ్చర్యపరిచిన ఆటగాళ్లలో జయదేవ్ ఉనాద్గత్  ఉన్నాడు అని చెప్పాలి. గత సీజన్లతో పోసి చూస్తే అతని ధర అమాంతం పడిపోయింది. 2022 సీజన్లు అతను ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇక భారీ ధర పెట్టి అతని కొనుగోలు చేసిన పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో ముంబై జట్టు అతన్ని వదిలించుకుంది.

 ఇక బేస్ ప్రైస్ 50 లక్షలకే అతని లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. అయితే 2018 లో జరిగిన వేలంలో జయదేవ్ ను  11.50 కోట్ల రూపాయలకు రాజస్థాన్ సొంతం చేసుకుంది. అయితే దేశవాళి క్రికెట్లో జయదేవ్  బాగా రాణిస్తున్న  ఐపీఎల్ కు వచ్చేసరికి మాత్రం అంచనాలను అందుకోలేక విఫలమవుతున్నాడు. ఇలా ఒకప్పుడు 11.5 కోట్లు పలికిన జయదేవ్  ఇక ఇప్పుడు 50 లక్షల బేస్ ప్రైస్ కే అమ్ముడుపోవడం అభిమానులు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఒకవేళ2023 ఐపీఎల్ సీజన్ లో కూడా అతను మంచి ప్రదర్శన చేయలేదు అంటే ఇక మరో సీజన్లో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు కూడా ముందుకు రాదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: