అతని కంటే ధోని కెప్టెన్సీ చాలా బెటర్ : బ్రాడ్ హగ్
ఇక అన్ని ఫార్మట్ లలో కూడా ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక భారత కెప్టెన్ గా ధోని చరిత్ర పుటల్లోకేక్కాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ధోని తన కెప్టెన్సీ తో ఎప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. ఇక ఎంత ఒత్తిడి సమయంలో అయినా సరే నవ్వుతూ ప్రశాంతంగా కనిపించే ధోని తన వ్యూహాలతో నిమిషాల వ్యవధిలో మ్యాచ్ ను తన వైపుకు తిప్పేయగల సమర్ధుడు అని చెప్పాలి. అందుకే ఇక ధోని కెప్టెన్సీ అంటే చాలు తప్పకుండా గెలిచి తీరుతామని అందరూ భావిస్తూ ఉంటారు.
ఇకపోతే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యం గురించి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. కెప్టెన్సీ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ కంటే భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బెటర్ అంటూ బ్రాడ్ హగ్ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా కెప్టెన్ గా పాంటింగ్ కంటే టీమిండియా సారథిగా ధోని ఎక్కువ రాజకీయాలను ఎదుర్కొన్నాడు అంటూ బ్రాడ్ హగ్ చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్ గా ఇద్దరికీ కూడా అద్భుతమైన రికార్డులు ఉన్నాయి అంటూ బ్రాడ్ హగ్ వ్యాఖ్యానించాడు.