ఇండియాపై గెలుపు.. మర్యాద తెచ్చిపెట్టింది : రిజ్వాన్

praveen
భారత దయాది దేశమైన  పాకిస్తాన్ జట్టు ఇటీవల ఇంగ్లాండుతో టెస్ట్ సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ ఆడినప్పటికీ ఇంగ్లాండు జట్టును ఓడించలేకపోయింది. దీంతో 2-0 తేడాతో ఇక సిరీస్ చేజార్చుకుంది. అయితే ఇక సిరీస్ కోల్పోవడమే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రేసు నుంచి కూడా తప్పుకుంది అని చెప్పాలి. ఇకపోతే ఒక స్పోర్ట్స్ ఛానల్ తో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 సాధారణంగా మ్యాచ్ తర్వాత మాట్లాడినప్పుడు ఎవరైనా సరే ఏకంగా మ్యాచ్ గెలుపోటముల గురించి మాట్లాడటం చూస్తూ ఉంటామూ. కానీ ఇక్కడ మహమ్మద్ రిజ్వాన్ మాత్రం 2021 టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పై విజయాన్ని గుర్తు చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా పై విజయం నా జీవితాన్ని మార్చేసింది అంటూ పేర్కొన్నాడు. ఇలా ఇండియాపై విజయం గురించి మాట్లాడుతూ ఇంగ్లాండు పై ఘోర పరాభవం గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావన తీసుకురాలేదు రిజ్వాన్. 2021 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత నా దేశంలో నాకు మర్యాద విపరీతంగా పెరిగిపోయింది.

 నేను ఎక్కడికైనా షాపింగ్ కి వెళ్లినా కూడా ఇక షాప్ కి యజమానులు తన దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. ఇండియాను ఓడించావు. అది చాలు. మాకు డబ్బులు వద్దు. నీకు అన్ని ఫ్రీ అంటూ షాప్ కీపర్లు కూడా తెగ మొహమాట పెట్టేస్తున్నారు.  తాను అయితే ఇండియా పై గెలిపును ఒక సాధారణ గెలుపు లాగే భావించానని కానీ స్వదేశానికి వెళ్ళిన తర్వాత ఆ గెలుపు ప్రత్యేకత ఏంటో తనకు తెలిసి వచ్చిందంటు చెప్పుకొచ్చాడు. మొహమ్మద్ రిజ్వాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే 2021 టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్లో ఏకంగా పాకిస్తాన్ టీం పది వికెట్ల తేడాతో విజయం సాధించింది.  కాగా ఆ మ్యాచ్ లో రిజ్వాన్ యాభై ఐదు బంతుల్లో 79 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: