మొన్నే మూతి పళ్ళు రాలాయ్.. కట్ చేస్తే ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు?

praveen
ప్రస్తుతం శ్రీలంక ప్రీమియర్ లీగ్ ఎంతో హోరాహోరీగా జరుగుతుంది అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగానే ఉత్కంఠ భరితంగా సాగుతూ అటు క్రికెట్ పరీక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇకపోతే ఇటీవల జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో జాప్నా కింగ్స్ జట్టుపై క్యాండీ ఫాల్కన్స్ విజయం సాధించింది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా తొలత బ్యాటింగ్ చేసిన జాప్నాకింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది

 ఇక ఈ మ్యాచ్ లో స్వల్ప లక్ష్యంతోనే బలిలోకి దిగిన క్యాండీ ఫాల్కన్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది అని చెప్పాలి   అయితే ఇక క్యాండీ ఫాల్కన్స్ విజయంలో చమిక కరుణ రత్నే ఎంతో కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి   అయితే కరుణ రత్నై మూడు రోజుల క్రితమే క్యాచ్ పట్టబోయి చివరికి గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. గాల్లోకి లేచిన బంతి క్యాచ్ పట్టే క్రమంలో నేరుగా వచ్చి అతని మూతి పై పడటంతో ఏకంగా పళ్ళు విరిగిపోయాయి. ఇక ఈ గాయం బారిన పడిన చమీకా కరుణ రత్నే మళ్లీ జట్టులోకి వచ్చి తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇక జట్టును విజయతీరాలకు చేర్చాడు అని చెప్పాలి.

 క్యాండీ ఫాల్కన్స్ జట్టుకు 100 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఇక జట్టు ఓటమి తప్పదు అనుకున్న పరిస్థితుల్లో ఏడవ స్థానంలో బ్యాటింగ్కు దిగిన కరుణ రత్నే 16 బంతుల్లోని 26 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు అని చెప్పాలి. కాగా గాల్ గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్లో కరుణ రత్నే ఇక క్యాచ్ పట్టబోయి తీవ్రంగా గాయపడటంతో నాలుగు పళ్ళు విరిగిపోయాయి  రక్తం దారిలా కారిపోయింది. అయినప్పటికీ బంతిని విడిచి పెట్టలేదు  నా నాలుగు పళ్ళు రాలిపోయాయ్.. అయినప్పటికీ ఇప్పటికీ నేను నవ్వగలను మళ్లీ త్వరగానే జట్టులోకి వస్తాను అంటూ కరుణ రత్నే వ్యాఖ్యానించాడు. చెప్పినట్టుగానే జట్టులోకి వచ్చి అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: