వావ్.. మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డ్?

praveen
గత కొన్ని సిరీస్ల నుండి హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్న మహమ్మద్ సిరాజ్ తనదైన ప్రదర్శనతో ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నాడు అని చెప్పాలి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదరగొడుతున్న మహమ్మద్ సిరాజ్ ఇక రానున్న రోజుల్లో తన స్థానాన్ని టీమిండియాలో సుస్థిరం చేసుకునేలాగే కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇక మొన్నటికి మొన్న న్యూజిలాండ్ పర్యటనలో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న మహమ్మద్ సిరాజ్ ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటనలో కూడా అదే జోరును కొనసాగిస్తూ ఉన్నాడు.

 ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా  వన్డే సిరీస్ ఆడుతూ ఉండగా.. మహమ్మద్ సిరాజ్ తన బౌలింగ్ తో నిప్పులు చెరుగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇకపోతే ఇటీవల వరుసగా రెండు వన్డే మ్యాచ్ లలో ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టు చివరికి సిరీస్ చేజార్చుకుంది అని చెప్పాలి. అయితే రెండో వన్డే మ్యాచ్లో ఇక మహమ్మద్ సిరాజ్ చివర్లో పరుగులు చేయకపోవడం కారణంగానే అటు టీమిండియా ఓడిపోయినట్టు ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే రెండో వన్డే మ్యాచ్లో ఫేసర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు సాధించాడు.

 2022 ఏడాదిలో వన్డే ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా సిరాజ్ నిలిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో అనుముల్ హక్ ను అవుట్ చేసిన తర్వాత సిరాజ్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో ఏకంగా 14 మ్యాచ్లు ఆడిన మహమ్మద్ సిరాజ్ 23 వికెట్లను పడగొట్టాడు అని చెప్పాలి. అయితే అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ చాహాల్ పేరిట ఉండేది. ఈ ఏడదిలో వన్డేల్లో 14 మ్యాచ్లు ఆడిన చాహాల్ 21 వికెట్లు పడగొట్టుగా   ఇక ఇటీవల హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఏకంగా 23 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: