రానున్న పదేళ్లు.. టీమిండియా ఫ్యూచర్ అతనే : రవిశాస్త్రి

praveen
గత కొంతకాలం నుంచి కేవలం వన్డేలు టెస్టులకు మాత్రమే పరిమితమైన టీమిండియా యువ ఆటగాడు శుభమన్ గిల్ న్యూజిలాండ్ పర్యటన ద్వారా టి20 లోకి అరంగేట్రం చేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా శుభమన్ గిల్ ప్రదర్శన పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు  ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను భారత క్రికెట్ ఫ్యూచర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల శుభమన్ గిల్ ప్రతిభ పై మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల కురిపించారు.

 శుభమన్ గిల్ అద్భుతమైన ఆటగాడు అంటూ ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎంత సక్సెస్ చూసిన ఎప్పటికి అతను ఎంతో వినయంగానే ఉంటాడని.. అదే అతని గొప్పతనం అంటూ చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి. 2022 లో తనకు వన్డే ఫార్మాట్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ ఏడాదిలో 11 వన్డేలు ఆడిన శుభమన్ గిల్ నాలుగు హాఫ్ సెంచరీలతో 625 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ తో కలిసి టీమిండియా ఓపెనర్ గా బరిలోకి దిగుతు సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ఇలా తన అద్భుతమైన ప్రదర్శనతో 2023 వరల్డ్ కప్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

 శుభమన్ గిల్ స్ట్రైక్ రేట్ కూడా ఎంతో మెరుగైంది. అతను ఒక నాణ్యమైన ప్లేయర్ రానున్న పదేళ్లపాటు తప్పకుండా జట్టులో ఉంటాడు అంటూ ప్రశంసలు కురిపించాడు రవి శాస్త్రి. కాగా న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో అదరగొట్టిన శుభమన్ గిల్ రెండో వన్డే మ్యాచ్ లో 45 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇలా వరుసగా ప్రదర్శనతో ఆకట్టుకున్న శుభమన్ గిల్ కు అటు బంగ్లాదేశ్ పర్యటనలో మాత్రం అవకాశం దక్కలేదు అని చెప్పాలి. ఎందుకంటే టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ గా ఉన్న రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ తిరిగి వస్తూ ఉండడం.. ఇక విరాట్ కోహ్లీ కూడా జట్టులో చేరుతూ ఉండడంతో శుభమన్ గిల్ కు జట్టులో చోటు దక్కలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: