న్యూజిలాండ్ తో మొదటి టీ20.. టీమిండియా ఫ్యాన్స్ కి నిరాశ?
ఇక మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ అభిమానులందరినీ కూడా వరుడు వరుసగా నిరాశ పరుస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో మ్యాచ్లు వర్షార్పణం అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులను వరుణుడు ప్రతిక్షణం భయపడుతూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ ఇండియా మధ్య జరగబోయే టి20 సిరీస్ కి కూడా వరుణ గండం పొంచి ఉంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే వెల్డింగ్టన్ వేదికగా జరగబోయే మ్యాచ్ కి వర్షం అంతరాయంకలుగుతుంది కలిగించబోతుంది అన్నది తెలుస్తుంది.
అయితే మ్యాచ్ జరిగే సమయానికి 50% కంటే ఎక్కువ వర్షం పడే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారట. అంతేకాకుండా గత రెండు రోజులుగా వెల్డింగ్టన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అన్నది తెలుస్తుంది. ఇప్పటికే పిచ్ పై కవర్స్ తో కప్పి ఉంచారు. ఒకవేళ నేడు రోజు మొత్తం భారీ వర్షం కురిసినట్లయితే మ్యాచ్ రద్దు చేసే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. దీంతో క్రికెట్ అభిమానులు మాత్రం ఎంతగానో నిరాశలో మునిగిపోయారు. ముఖ్యంగా టీమిండియా ప్రదర్శనను మరోసారి చూడాలనుకున్న టీమిండియా ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది అన్నది తెలుస్తుంది.