క్రికెట్ లో.. రేప్ కేసులో ఇరుక్కున్న ఆటగాళ్లు వీళ్లే?

praveen
శ్రీలంక స్టార్ క్రికెటర్ ధనుష్క గుణతిలక ఇటీవలే అత్యాచార ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా హోటల్ గదిలో గుణతిలకా తనపై అత్యాచారం చేశాడు అంటూ ఏకంగా 29 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి చివరికి స్టార్ క్రికెటర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే అటు గుణ తిలకను ఆస్ట్రేలియాలోనే  వదిలేసి శ్రీలంక జట్టు యాజమాన్యం మిగతా ఆటగాళ్లతో స్వదేశం వెళ్లిపోయింది. అంతేకాదు అతన్ని మూడు ఫార్మాట్స్ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది.
 ఇకపోతే గుణతిలకపై రేప్ కేసు నమోదవడం సంచలనం సృష్టించగా..  అతనే లాగానే ఇప్పటివరకు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన క్రికెటర్లు ఎవరు అన్న విషయం కూడా చేర్చవచ్చింది. ఆ వివరాలు చూసుకుంటే..
 ఈ జాబితాలో మొదటి పేరు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మాకయ అంటినదే ఉంది అని చెప్పాలి. 1999లో ఆంటినీ 22 ఏళ్ల యువతపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏకంగా టాయిలెట్ రూంలో తనపై అత్యాచారం  చేశాడంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని  అరెస్టు చేసి జైలుకు తరలించారు పోలీసులు. ఇక అతడు నిర్దోషి అని నిరూపించుకోవడానికి దశాబ్ద సమయం పట్టింది. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు.
 పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అత్తర్ పై కూడా ఇలాంటి అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. 2005లో ఆస్ట్రేలియా పర్యటనలో తనపై అక్తర్  చేశాడంటూ ఒక మహిళ ఆరోపణలు చేసింది. దీంతో మేనేజ్మెంట్ అతన్ని వెనక్కి పంపించింది. అయితే అప్పట్లో ఇది పెద్దగా హైలెట్ కాకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది.

 బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్ పై కూడా 2015లో అత్యాచార ఆరోపణలు వచ్చాయి.. అతని స్నేహితురాలే అతనిపై రేప్ కేసు నమోదు చేయడం గమనార్హం. పెళ్లి సాకుతో  లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతని అరెస్టు చేశారు పోలీసులు.
 ఇక ఈ లిస్టులో భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఏకంగా అమిత్ మిశ్రా స్నేహితురాలు లైంగిక ఆరోపణలు చేస్తూ అతనిపై కేసు వేసింది. ఇక బెంగళూరు పోలీసులు అతని అరెస్టు చేసి విచారించగా నిర్దోషి అని తేలడంతో ఆ తర్వాత విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: