" data-original-embed="" >
ప్రస్తుతం గ్రూప్ 2 లో ఎవరు సెమీస్ కు వెళ్లనున్నారు అన్న విషయం ఈ రోజు ముగిసిన పాక్ మరియు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో మరింత రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఈ గ్రూప్ నుండి ఇండియా , సౌత్ ఆఫ్రికా, ఇండియా మరియు బంగ్లాదేశ్ లకు సెమీస్ కు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం ఛాన్సెస్ మాత్ర, సౌత్ ఆఫ్రికా మరియు ఇండియాలకే ఉన్నాయి. కానీ ఈ రోజు సౌత్ ఆఫ్రికా పాక్ చేతిలో దారుణంగా ఓడిపోవడంతో కాస్త టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పాక్ కనుక సెమీస్ చేరాలంటే... సౌత్ ఆఫ్రికా తన ఆఖరి మ్యాచ్ లో నెదర్లాండ్ తో భారీ ఓడిపోయి అదే సందర్భంలో పాకిస్తాన్ బంగ్లాను ఓడిస్తే సులభంగా సెమీస్ చేరుకుంటుంది.
అయితే సౌత్ ఆఫ్రికాను నెదర్లాండ్ ఓడిస్తుందా అన్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్న ? ఖచ్చితంగా అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఈ టోర్నీలో నెదర్లాండ్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ అది కూడా జింబాబ్వే పై గెలిచింది. కాగా ఇక్కడ మరొక అవకాశం కూడా పాక్ కు ఉంది. ఇండియాకు ఆరు పాయింట్లు మరియు నెట్ రన్ రేట్ +0.73 గా ఉంది. ఇక పాకిస్తాన్ ఈ రోజు గెలుపుతో ఒక్కసారిగా మైనస్ నుండి ప్లస్ కు రన్ రేట్ మెరుగుపరుచుకుంది, అలా నాలుగు పాయింట్లతో +1.117 ను కలిగి ఉంది. ఇండియా ఆఖరి మ్యాచ్ లో జింబాబ్వే తో ఆడనుంది, ఇప్పుడు జింబాబ్వే ఆటగాళ్లకు పాకిస్తాన్ కు చెందిన సినీ నటి షెహర్ సింవారి ఒక బంపర్ ఆఫర్ ను ఇచ్చింది.
జింబాబ్వే ఇండియాను చిత్తు చిత్తుగా ఓడిస్తే జింబాబ్వే దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. తాను ట్విట్టర్ ద్వారా బహిరంగంగా పోస్ట్ చేసింది. ఇది చూసిన ఇండియన్స్ ఆమెపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఒకవేళ అలా జరిగితే ఇండియా కు రన్ రేట్ తగ్గిపోయి పాక్ సెమీస్ కు చేరుకుంటుంది. మరి చూద్దాం ఈ అమ్మాయి పెళ్ళో ఎవరితో జరుగుతుందో ?