అయితే సెంచరీ.. లేదంటే డక్ ఔట్.. ఇదేందయ్యా ఇది?

praveen
సాధారణంగా ఎంతో మంది ఆటగాళ్లు టి20 ఫార్మాట్లో సెంచరీ చేయాలని భావిస్తూ ఉంటారు. ఇలా సెంచరీ చేయడం ద్వారా ఒక వైపు జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించడమే కాదు మరోవైపు ఇక సెంచరీల ద్వారా రికార్డు సృష్టించాలని భావిస్తూ ఉంటారు.  అయితే ఎంతటి స్టార్ ఆటగాడు అయినా సరే కూడా ప్రతి మ్యాచ్లో సెన్సరీ చేయడం అసాధ్యం అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు సెంచరీ చేయకపోయినప్పటికీ అటు మ్యాచ్ను గెలిపించే కీలక ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటారు లేదా ఆఫ్ సెంచరీలతో  సరిపెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి.  కానీ ఇక్కడ ఒక ఆటగాడు మాత్రం ఎంతో విచిత్రమైన ఆట తీరుతో అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాడు. అతను క్రీజ్ లోకి దిగాడు అంటే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఎందుకంటే సిక్సర్లు ఫోర్ లతో వీర విహారం చేస్తూ బౌలర్ల పై పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఏకంగా సెంచరీలతో ఊగిపోతున్నాడు అని చెప్పాలి. సెంచరీలు బాగానే చేస్తున్నాడు కదా అందులో విచిత్రం ఏముంది అని అని అనుకుంటున్నారా.. అయితే ఈ ఆటగాడి గురించి మరో విషయం కూడా దాగి ఉంది. వరుసగా సెంచరీలు చేస్తున్న ఈ ఆటగాడు ఒకవేళ సెంచరీలు చేయలేదంటే ఇక డక్ అవుట్ గా వెను తిరుగుతూ ఉండడం గమనార్హం. అయితే సెంచరీ  లేదంటే డక్ అవుట్ అన్న విధంగానే తన ఆట తీరును కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 సదరు ఆటగాడు ఎవరో కాదు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ రూసో. అతని గురించి తెలిసి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. రూసో ఆడిన ఐదు ఇన్నింగ్స్ స్కోర్లు చూసుకుంటే 2(0), 56( 109), 48 బంతుల్లో (100), 1(0)  సున్నా ఇలా అయితే సెంచరీ లేదంటే డక్ అవుట్ అనే విధంగా ఆటతీరును  కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 109 పరుగులు చేయగా ఇటీవల ఇండియా పై జరిగిన మ్యాచ్ లో మాత్రం డక్ అవుట్ గా వెనతిరిగాడు. సౌత్ ఆఫ్రికా తర్వాత మ్యాచ్ నవంబర్ మూడో తేదీన పాకిస్తాన్తో ఆడబోతుంది. అందులో ఏం చేస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: