మా తడాఖా ఏంటో చూపిస్తాం.. టీమిండియాకు వార్నింగ్?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో కూడా విజయం సాధించి గ్రూప్ 2 పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది. ఇక మెరుగైన రన్ రేట్ కూడా మెయిన్టైన్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు పాకిస్తాన్ నెదర్లాండ్స్ ను ఎదుర్కొన్న భారత జట్టు రెండింటిపై కూడా విజయ డంకా మోగించింది. కాగా నేడు మరో కీలకమైన మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో పటిష్టమైన దక్షిణాఫ్రికాను నేడు ఎదుర్కోబోతుంది. ఇక ఈ మ్యాచ్ సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి.

 పెర్త్ వేదికగా ఈ ఉత్కంఠ భరితమైన పోరు జరుగుతుంది. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు ఇక అన్ని విభాగాల్లో కూడా టీమిండియా కు అసలు సిసలైన సమవుజ్జి కావడం గమనార్హం. దీంతో ఈ పోరు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇలాంటి ఉత్కంఠ నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ నోర్జె  కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా టీమ్ ఇండియాకు తమ బౌలింగ్ ఎటాక్ తడాఖా ఏంటో చూపించబోతున్నాము అంటూ భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చేసాడు అని చెప్పాలి. అంతేకాదు ప్రపంచ కప్ లో తమది బెస్ట్ బౌలింగ్ ఎటాక్ అంటూ అభివర్ణించడం గమనార్హం.

 ఇక తమ జట్టు బౌలర్ల బౌలింగ్ లో ఉండే వైవిద్యం ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా ఇబ్బంది పెట్టగలదు అంటూ పేర్కొన్నాడు. ఇటీవలే మ్యాచ్ కూ ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్రిచ్ నోర్జె ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక ఎంతో ప్రతిభ కలిగిన ఇద్దరు యువ స్పిన్నర్లు తమ జట్టులో ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇక ఇండియాతో ఆడబోయే మ్యాచ్ తమకు అత్యంత కీలకమైనదని.. ఇందులో గెలిచి తీరాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపాడు. ఇక ఈ ఏడాది తప్పకుండా ప్రపంచ కప్ కొట్టి విశ్వవిజేతగా నిలవబోతున్నాము అంటూ ఎన్రిచ్ నోర్జె ధీమా  వ్యక్తం చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: