ఎంతో మంది సలహాలిస్తారు.. కానీ ఆ బాధ మాకే తెలుసు :భువి

praveen
ప్రస్తుతం టీమ్ ఇండియాలో సీనియర్ బౌలర్గా కొనసాగుతూ అటు భారత బౌలింగ్ విభాగాన్ని ముందుకు నడిపిస్తూ మంచి ఫలితాలను రాబట్టడంలో విజయం సాధిస్తున్నాడు భువనేశ్వర్ కుమార్. తన తనదైన స్వింగ్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ ఇక ప్రత్యర్థులను ముప్పు తిప్పులు పెడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల భారత్ ప్రపంచ కప్ లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడగా రెండు మ్యాచ్లలో కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుని కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు. ఇలా భువనేశ్వర్ కుమార్  ఎలా రానిస్తాడు అని ఆందోళన చెందిన వారందరికీ కూడా తన బౌలింగ్ తో భరోసా కల్పిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా తన ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అనే విషయంపై సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రపంచ కప్ టోర్నీ ఆరంభానికి ముందే తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మొదలుపెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు. నేను సోషల్ మీడియాను పక్కన పెట్టేసాను. అందుకే అందులో ఏం రాశారు అన్న విషయం కూడా నాకు తెలియదు. మీ అందరికీ కూడా సామాజిక మాధ్యమం ద్వారానే ఏం జరుగుతుంది.. ఏం రాశారు అన్న విషయం తెలుసు.

 అయితే జీవితంలో ఎత్తు పల్లాలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. సక్సెస్ సాధించడానికి కేవలం అవసరమైన అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్ అనేది బౌలర్లకు ఎంతో క్లిష్టంగా ఉంటుంది. అభిమానులు, కామెంటేటర్లు మాజీలు ఇలా ఎంతోమంది డెత్ ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయాలి అనే విషయంపై చాలా మాటలు చెబుతారు. కానీ బౌలర్లుగా జట్టుగా మాకు అందులో ఉండే కష్టాలు ఏంటో తెలుసు. కొన్నిసార్లు బౌలర్లకు ఎంత కష్టం ఉంటుందో.. బౌలింగ్ ట్రాక్ అయితే  బ్యాట్స్మెన్ లకు అంతే కష్టంగా ఉంటుంది అంటూ భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: