ప్రపంచకప్ నుంచి పాక్ ఔట్.. కథ ముగిసినట్లేనా?

praveen
ఈ ఏడాది టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు అడుగడుగున నిరాశ ఎదురవుతుంది అని చెప్పాలి. ఒకవైపు బౌలింగ్ విభాగంలో మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ లో మాత్రం ఒత్తిడి ముందు తలవంచుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పాకిస్తాన్ వరల్డ్ కప్ లో భాగంగా బోనీ కొట్టలేకపోయింది అని చెప్పాలి. ఇక ప్రపంచ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ అటు చిరకాల ప్రత్యర్థి అయిన భారత్తో ఆడింది పాకిస్తాన్ జట్టు.


 అయితే భారత్ పటిష్టమైన జట్టు అయినప్పటికీ పాకిస్తాన్ ఎంతో దీటైన పోటీ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే భారత్తో మ్యాచ్లో పాకిస్తాన్ ఒకానొక దశలో గెలుస్తుందేమో అన్న విధంగానే మారిపోయింది. కానీ ఆ తర్వాత భారత బ్యాట్స్మెన్లు పుంజుకోవడంతో చివరికి పాకిస్థాన్కు ఓటమి తప్పలేదు. అయితే ఇటీవల జింబాబ్వేతో మ్యాచ్ ఆడింది పాకిస్తాన్ జట్టు పటిష్టమైన భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ అటు పసికూన జింబాబ్వే జట్టును మాత్రం చిత్తుగా ఓడించి బోని కొడుతుందని అందరూ అనుకున్నారు. ఇటీవల  జరిగిన మ్యాచ్లో చివరికి జింబాబ్వే పాకిస్తాన్ పై విజయం సాధించి చరిత్ర సృష్టించింది.


 అయితే వరల్డ్ కప్ లో భాగంగా వరుసగా  ఓటములు చవిచూస్తున్న పాకిస్తాన్ జట్టుకు దాదాపు సెమీస్ అవకాశాలు ముగిసిపోయాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ సెమీస్లో అడుగు పెట్టాలంటే ఆ జట్టు ప్రదర్శన మీదే కాదు ఇతర జట్ల గెలుపు ఓటమిల మీద కూడా ఫలితం ఆధారపడి ఉంది అని చెప్పాలి. పాకిస్తాన్ సెమిస్ లో అడుగు పెట్టాలంటే అన్ని మ్యాచ్లు కూడా తప్పకుండా గెలవాలి అది కూడా భారీ తేడాతో. అంతేకాకుండా ఇక టీమ్ ఇండియా జట్టు తప్పకుండా అన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అదే గ్రూప్లో ఉన్న సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే జట్లు రెండేసి మ్యాచ్లలో ఓడిపోవాల్సి ఉంటుంది   ఇవన్నీ జరిగితేనే పాకిస్తాన్ సెమీస్ లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: