కోహ్లీ, సూర్య లను.. చరణ్, తారక్ తో పోల్చిన సెహ్వాగ్?
అయితే పటిష్టమైన పాకిస్తాన్ పై విజయం సాధించి ఇక ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా ఇటీవల నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇక నెదర్లాండ్స్ తో మ్యాచ్ అనేసరికి తేలికగా తీసుకోకుండా ఎంతో సీరియస్ గానే ఎఫర్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే ఇక నెదర్లాండ్స్ ను చిత్తుగా ఓడించి తన రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది అని చెప్పాలి. ఇక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు కూడా అర్థ సెంచరీలు పూర్తిచేసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు అని చెప్పాలి. అప్పటివరకు రోహిత్ శర్మ ఆడిన తీరు ఒక ఎత్తైతే ఇక తర్వాత విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ మాత్రం మ్యాచ్ కు హైలెట్గా నిలిచింది.
ఇద్దరూ కూడా బౌండరీలతో చెలరేగిపోయి పరుగులు రాబట్టుకున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ చివర్లో సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ ఆడిన తీరుపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలోనే సోషల్ మీడియాలో స్పందించాడు. ఏకంగా సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ కలిసి బ్యాటింగ్ చేయడానికి చూడటం ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్ సినిమాలో చరణ్, తారక్ ఫోటోలు షేర్ చేసాడు సెహ్వాగ్. ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది.