బంతి కాలికి తాకి ఉంటే.. రిటైర్మెంట్ ప్రకటించేవాడిని : అశ్విన్

praveen
ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్ధులుగా పేరు సంపాదించుకున్న భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎంత హోరాహోరీగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నరాలు తిరిగే ఉత్కంఠ మంచి జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా కష్టాల్లో నుంచి గట్టెక్కి ఇక ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయం సాధించి బోనీ కొట్టింది. అయితే చివరి ఓవర్ వరకు కూడా విజేత ఎవరు అన్నది ప్రేక్షకులకు ఊహకందని విధంగానే మారిపోయింది. అదే సమయంలో ఇక చివరి ఓవర్ లో ఎన్నో నాటకీయ  పరిణామాలు చోటు చేసుకున్నాయ్ అని చెప్పాలి.

 ఇకపోతే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన నాటి నుంచి కూడా ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కు సంబంధించి అందరూ చర్చించుకున్నారు. కానీ ఇప్పుడు ఇక మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్ అని చెప్పాలి. కీలకమైన సమయంలో దినేష్ కార్తీక్ వికెట్ కోల్పోయిన టైంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేయడానికి క్రీజు లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే అశ్విన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నదానిపై అందరి దృష్టి ఉంది. ఇక ఇలా నరాలు తెగే ఉత్కంఠ మధ్య తీవ్ర ఒత్తిడి ఉన్న సమయంలో కూడా ఎంతో తెలివిగా ఆలోచించిన అశ్విన్ బంతిని ఎంతో సింపుల్ గా వదిలేసాడు.

 ఇక ఇలా ఒత్తిడి సమయంలో కూడా అశ్విన్ తెలివిగా ఆలోచించిన తీరు అందరిని మంత్రముగ్ధులను  చేసింది అని చెప్పాలి.  అయితే ఇలా ఒత్తిడి సమయంలో బంతిని వైడ్ గా వదిలేయడంపై ఇటీవలే అశ్విన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  పాకిస్తాన్ బౌలర్ నవాజ్ వేసిన బంతిని తాను వైడ్ అనుకుని వదిలేసాను  ఒకవేళ ఆ బంతి తన కాళ్లకు తగిలి ఉంటే మాత్రం డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి వెంటనే సోషల్ మీడియా ద్వారా తన టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించేవాడిని అంటూ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: