పాకిస్తాన్తో మ్యాచ్లో విఫలం.. ఇప్పుడు అందరి దృష్టి అతనిపైనే?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ ను ఓడించి శుభారంభం చేసిన టీమిండియా ఇక ఇప్పుడు రెండవ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. అయితే అటు రెండవ మ్యాచ్ పసికూన నెదర్లాండ్స్ జట్టుతో జరుగుతున్నప్పటికీ కూడా ఈ మ్యాచ్ కూడా టీమిండియా సీరియస్ గానే తీసుకుంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక పటిష్టమైన జట్టుతోనే బరిలోకి దిగడం కారణంగా నెదర్లాండ్స్ పై భారీ తేడాతో విజయం సాధిస్తే ఇక టీమిండియా నెట్ రన్ రేట్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. సెమీస్ చేరే సమయంలో ఏవైనా క్లిష్ట పరిస్థితులు ఏర్పడితే ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ తో మ్యాచ్ ను ఇక అంత తేలికగా తీసుకోకుండా సీరియస్ గానే బరిలోకి దిగేందుకు సిద్ధమైంది టీం ఇండియా   అయితే పాకిస్తాన్ తో మ్యాచ్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ తీవ్రస్థాయిలో నిరాశపరిచాడు అని చెప్పాలి.  కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి చివరికి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వికెట్ కోల్పోవడంతో టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్లో విఫలమైన కేఎల్ రాహుల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.

 ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి తప్పులను పునరావృతం చేయకుండా ఉండేలా ప్రస్తుతం కేఎల్ రాహుల్ నెదర్లాండ్స్ తో మ్యాచ్లో భారీ పరుగులు చేసేందుకు నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ తో మ్యాచ్లో అందరి దృష్టి కూడా ఓపెనర్ కేఎల్ రాహుల్ పై ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ అవతల పడిన బంతిని ఆడే ప్రయత్నంలో కేఎల్ రాహుల్ వికెట్ సమర్పించుకుంటూ ఉండటం గమనార్హం. అయితే ఈ లోపాన్ని సరిదిద్దుకోవడం పైన అతను దృష్టి పెట్టాడు. ఇక హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో కోచింగ్ బృందం కూడా దీనిని సరి చేసే  ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శార్దూల్ ఠాగూర్, సిరాజ్ పదే పదే ఫోర్త్ స్టంప్ పైన బంతులు వేసి కేఎల్ రాహుల్ కు కావలసిన ప్రాక్టీస్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: