టీమిండియా ముందున్న.. ఒకే ఒక సమస్య అదే : గవాస్కర్

praveen
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్పై విజయం సాధించి భోని కొట్టింది టీమిండియా జట్టు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇలా టీమ్ ఇండియా విజయం సాధించడంతో సంబరాల్లో మునిగిపోయిన టీమ్ ఇండియా అభిమానులు.. అటు టీమ్ ఇండియా వైఫల్యం పై మాత్రం మాట్లాడలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ,  రాహుల్ జట్టుకు శుభారం ఇవ్వాల్సింది పోయి చేరో నాలుగు పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నారు.

 అయితే పాకిస్తాన్ పై విజయం సాధించడంతో ఇక ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇటీవల భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడం టీమిండియాను ఎంతగానో ఆందోళనకు గురిచేస్తుంది అంటూ సునీల్ గవాస్కర్  అభిప్రాయం వ్యక్తం చేశాడు . ఇక ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ తెలిపాడు. ప్రస్తుతం టీమిండియాలో ఏదైనా సమస్య ఉంది అంటే అది కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడం మాత్రమే అంటూ అభిప్రాయపడ్డాడు.

 గత కొన్ని రోజుల నుంచి రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదని చెప్పుకొచ్చాడు. అతడు ఓపెనర్ గా మంచి ఆరంభం ఇస్తే ఇక మిగతా బ్యాట్స్మెన్ లకు ఎంతో సులువు అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అతను మంచి ఓపెనింగ్ చేస్తే ఇక మిగతా బ్యాటర్లకు ఒత్తిడి కాస్త తగ్గుతుందని చెప్పుకొచ్చాడు. మొదటి బంతి నుంచి హిట్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా మంచి స్కోర్ కూడా సాధించవచ్చు. తదుపరి జరిగే మ్యాచ్లలో మొదటి ఆరు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఉండడమే కీలకం  అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. నెమ్మదిగా బ్యాటింగ్  చేసిన వికెట్ కాపాడుకోవాలని సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: