కోహ్లీ ఇన్నింగ్స్ పై.. బాబర్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఇటీవలే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్లో విరాట్ కోహ్లీ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తీరు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరిని కూడా మంత్రముగ్ధులను చేసింది అని చెప్పాలి. గత మూడేళ్ల నుంచి సరైన ఫామ్ లో లేక ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ.. ఆసియా కప్ లో మాత్రం ఆఫ్గనిస్తాన్తో మ్యాచ్లో సెంచరీ చేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మొదటి మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ క్లిష్టమైన సమయంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.

 24 బంతుల వరకు కూడా ఎంతో నెమ్మదిగా ఆచితూచి ఆడుతూ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా గేర్ మార్చాడు. ఇక జట్టును గెలిపించాలంటే బ్యాట్ జులిపించాల్సిందే అని నిర్ణయించుకొని.. సిక్సర్లు పోరులతో చెలరేగిపోయాడు. తనదైన శైలిలో సొగసైన షాట్లు ఆడుతూ.. అటు పాకిస్తాన్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు అని చెప్పాలి. 53 బంతుల్లో 82 పరుగులు చేసి ఇక భారత జట్టుకు అనూహ్యమైన విజయాన్ని అందించాడు.

ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే కోహ్లీ ఇన్నింగ్స్ పై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం సైతం ప్రశంసలు కురిపించాడు. టీమిండియా గెలుపు క్రెడిట్ అంతా విరాట్ కోహ్లీ కే దక్కుతుందని బాబర్ అజాం చెప్పుకొచ్చాడు. చాలామంది కోహ్లీ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఫామ్ కన్నా క్లాస్ శాశ్వతం అని కోహ్లీ ఈరోజు రుజువు చేశాడు అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు. భారత్ ఓడిపోతుంది అనుకున్న దశలో విరాట్ కోహ్లీ మాయాజాలం చేశాడు అంటూ బాబర్ వ్యాఖ్యానించాడు  ఇక స్టేడియం నుంచి ఒక్కరు కూడా వెళ్లిపోలేదని ఇంతకంటే క్రీడలకు మంచి ప్రచారం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: