న్యూజిలాండ్ ఓపెనర్.. అరుదైన రికార్డ్?
అందుకే టి20 ఫార్మాట్లో బ్యాటింగ్ అంటే చాలు ఆడిన బంతులకు చేసిన స్కోర్ కి అసలు సంబంధం ఉండదు. ఇక ఇలాంటివి చేసిన వారే అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అత్యంత వేగంగా టి20 ఫార్మట్ లో 1000 పరుగులు చేసి రికార్డు సృష్టించడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఇకపోతే ఇప్పుడు ఇలాంటి రికార్డునే సాధించి ప్రపంచ రికార్డును కొట్టేసాడు న్యూజిలాండ్ ఓపెనర్ డేవన్ కాన్వే. టి20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మెన్ గా అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాంతో కలిసి ప్రస్తుతం రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పటివరకు ఏకంగా 26 ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు న్యూజిలాండ్ ఓపెనర్ డేవన్ కాన్వే. ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న మ్యాచ్లో 59 పరుగుల వద్ద ఈ అరుదైన ఘనత సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో మొత్తంగా 92 పరుగులు చేశాడు. ఈ లిస్టులో డేవిడ్ మళన్ 24 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు పూర్తిచేసే మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత కోహ్లీ 27 ఇన్నింగ్స్ లు, పించ్ 29, కే.ఎల్ రాహుల్ 29, రిజ్వాన్ 31, సూర్య కుమార్ 31 ఇన్నింగ్స్ లతో తర్వాత స్థానంలో ఉన్నారు.