ఇషాన్ కిషన్ అరుదైన రికార్డ్.. రెండో ఇండియన్ ప్లేయర్?
ఇకపోతే ఇటీవల భారత జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా వరల్డ్ కప్ ఆడేందుకు ఆస్ట్రేలియా పయనం అయిన నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఇక అటు సౌత్ఆఫ్రికా తో ఆడబోయే వన్డే సిరీస్ లో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఇషాన్ కిషన్ తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజు లోకి వచ్చిన ఇషాన్ కిషన్ 93 పరుగులతో క్రీజులో పాతుకుపోయాడు. సెంచరీ చేస్తాడు అనుకున్నప్పటికీ ఏడు పరుగుల దూరంలో చివరికి వికెట్ కోల్పోయాడు.
శ్రేయస్ అయ్యర్ 93 పరుగుల ఇన్నింగ్స్ లో నాలుగు ఫ్లోర్లు ఏడు సిక్సర్లు ఉన్నాయి అంటే అతను బౌలర్ల పై ఏ రీతిలో విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్లో యువ అటుగాడు ఇషాన్ కిషన్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక వన్డే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా ఇషాన్ కిషన్ రికార్డ్ సృష్టించాడు. ఇషాన్ కిషన్ 24 ఏళ్ళ 83 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అయితే తొలి స్థానంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నాడు. 2021 లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు సిక్సర్లు కొట్టాడు. అప్పుడు అతని వయసు 23 ఏళ్ల 173 రోజులు కావడం గమనార్హం.