ఆసియా కప్.. ఫైనల్ మ్యాచ్ నేడే?
కేవలం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు ప్రతీ మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితం గా జరిగింది. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారో తెలియని విధం గా మారి పోయింది. తద్వారా ఉత్కంఠతో ప్రేక్షకులను ప్రతి మ్యాచ్ ముని వేళ్ళపై నిల బెట్టింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. గత కొన్ని రోజుల నుంచి ఎంతో ఉత్కంఠభరితం గా జరుగుతున్న ఆసియా కప్లో భాగంగా కీలకమైన మ్యాచ్లలో విజయాలు సాధించిన శ్రీలంక పాకిస్థాన్ జట్లు సూపర్ 4లో భాగంగా టాప్ 2 అవకాశం దక్కించుకున్నాయి. ఈ క్రమం లోనే ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి.
ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగబోతుంది. అయితే భారత్ పాకిస్తాన్ లాంటి మేటి జట్లను ఓడించిన శ్రీలంక టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగబోతోంది అని చెప్పాలి. బ్యాటింగ్ లో శ్రీలంక జట్టు ఎదురుదాడి మంత్రంగా ఆడుతూ ఉంది. ఇక పాకిస్థాన్ కూడా ఎంతో పటిష్టంగానే కనిపిస్తుంది అని చెప్పాలి. బౌలింగే పాకిస్థాన్ జట్టు బలం అని చెప్పాలి. బ్యాటింగ్ లో మాత్రం నిలకడలేమీ కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇక నేడు జరగబోయే మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది..