వాళ్లలో ఒక్కడికైనా క్యాచ్ పట్టడం వచ్చా.. అర్షదీప్ ను విమర్శిస్తారా : గవాస్కర్

praveen
ఇటీవలే ఆదివారం రోజున ఆసియా కప్లో భాగం గా జరిగిన దాయాదుల పోరు ఎంతో ఉత్కంఠ వద్ద జరిగిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకు కూడా మ్యాచ్ కొనసాగింది. చివరికి ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది. గతం లో లీగ్ దశలో భారత్ చేతి లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది పాక్ అని చెప్పాలి. అయితే కీలక సమయం లో సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతున్న పాకిస్తాన్ అసిఫ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను భారత బౌలర్ అర్షదీప్ వదిలేశాడు.  ఒకవేళ అతను క్యాచ్ పట్టి ఉంటే మంచి ఫలితం మరోలా ఉండేది.

 ఈ క్రమం లోనే అతని కారణం గానే జట్టు ఓడి పోయిందని అతని జట్టు నుంచి పీకి పక్కన పెట్టేయాలి అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. అదే సమయం  లో వికీ పీడియాలో అర్షదీప్ ఐడెంటిటీ మారుస్తూ అతడిని ఖలీస్తాని  అని చిత్రీకరించడం మరింత తీవ్ర దుమారం రేపింది. ఇటీవల ఇదే విషయం పై స్పందించిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ట్రోల్స్ చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదు. అర్షదీప్ సింగ్ ని ఏ ఒక్క మాజీ క్రికెటర్ విమర్శించలేదు. ఇక మిగతా వారు ఎవరు.. వాళ్ళకి అంత ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం ఏముంది.. అర్షదీప్ ను విమర్శించిన వాళ్ళలో ఎక్కడికైనా  క్యాచ్ పట్టే సత్తా ఉందా.. స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్లు చూస్తారు.. స్టాండ్స్ లో పడ్డ ఒక బంతినైనా వీళ్లు క్యాచ్ పట్టగలరా.. వాళ్ల గురించి ఆలోచించడం.. ట్రోల్స్ కి అంత ప్రాముఖ్యత ఇవ్వడం పూర్తిగా దండగ..పట్టించుకోవడం కూడా వృధా అంటూ సునీల్ గవాస్కర్  చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: