మా ఓటమికి కారణం అదే : బాబర్
మ్యాచ్ చివరి వరకు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగింది అని చెప్పాలి. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారు అనేది ఊహకందని విధంగా మారిపోయింది.. చివరికి హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించి ఇక చివరికి సిక్సర్తో జట్టుకు విజయాన్ని అందించాడు. బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో టీమిండియా మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకుంది అని చెప్పాలి అయితే ఇటీవలే పాకిస్తాన్ జట్టు ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ బారసాల మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేలవమైన బ్యాటింగ్ కారణంగానే భారత్ చేతిలో ఓటమి పాలు అయ్యామంటూ బాబర్ చెప్పుకొచ్చాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారు ఇంట్లో మాత్రం మరిన్ని పరుగులు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు
అయితే జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కు వచ్చి జట్టును విజయతీరాలకు వైపు నడిపించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకానొక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో ఇక భారత జట్టు ఓడిపోతుంది అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా హార్దిక్ పాండ్యా మెరుపు బ్యాటింగ్తో ఆడుతుంటే.. రవీంద్ర జడేజా అతనికి మంచి మద్దతు అందించాడు. ఈ ఇద్దరు ఆల్ రౌండర్ లు జట్టుకు విజయాన్ని అందించారు అని చెప్పాలి.ఏదేమైనా పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించడంతో భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.