కేఎల్ రాహుల్ దేశభక్తి.. అతడు చేసిన పనికి అభిమానుల ఫిదా?

praveen
ప్రస్తుతం టీమిండియా లో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు కె.ఎల్.రాహుల్. అయితే గత కొంత కాలంగా గాయం తో బాధ పడుతూ జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ఇక ఇటీవలే గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టు లోకి పునరాగమనం చేశాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక జింబాబ్వే పర్యటన లో భాగంగా టీమిండియా సారథ్య బాధ్యతలను కూడా అందుకున్నాడు కె.ఎల్.రాహుల్. కాగా ఇటీవల కేఎల్ రాహుల్ సారథ్యం లో బరి లోకి దిగిన టీమిండియా జట్టు మొదటి వన్డే మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించి సత్తా చాటింది. పది వికెట్ల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి.

 190 పరుగుల లక్ష్యం తో బరి లోకి దిగిన భారత జట్టు ఒక వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించడం గమనార్హం. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ చేసిన పని ప్రస్తుతం అభిమానులు అందరిని కూడా గర్వ పడేలా చేస్తుంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే ప్రస్తుతం ఎంతో మంది కేఎల్ రాహుల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు కారణం జాతీయ గీతాలాపన సమయంలో కె.ఎల్.రాహుల్ ఎంతో హుందాగా నడుచుకోవడమే.

 జాతీయ గీతాలాపన కు సిద్ధమవుతున్న సమయం లో కె.ఎల్.రాహుల్ చూయింగ్ గమ్ ను నములుతూ ఉన్నాడు. అయితే సరిగ్గా జనగణమన మొదలయ్యే సమయానికి తన నోట్లో ఉన్న చూయింగ్ గమ్  తీసేసాడు. ఇలా జాతీయ గీతాలాపన సమయంలో ఎంతో శ్రద్ధగా ఉండాలి అని చాటిచెప్పాడు.  ఇక ఇది కాస్త కెమెరాలకు చిక్కడంతో ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.  రాహుల్ కు అభిమానుల గా ఉండడం ఎంతో గర్వంగా ఫీలవుతున్నాము అని ఎంతో మంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: