పసి కూనపై ఘన విజయం సాధించిన టీమిండియా!

Purushottham Vinay
జింబాబ్వేతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా మొత్తం 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంని సంపాదించింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మొత్తం 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా కేవలం 30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 192 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (81 నాటౌట్: 113 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) ఇంకా శుభ్‌మన్ గిల్ (82 నాటౌట్: 72 బంతుల్లో, 10 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు.జింబాబ్వే టాపార్డర్‌ను కుప్పకూల్చిన దీపక్ చాహర్‌కు ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరు ఓవర్ల వరకు సాఫీగానే సాగింది. అనంతరం భారత పేస్ బౌలర్లు వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఓడించారు. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన దీపక్ చాహర్ మూడు వరుస ఓవర్లలో ఏకంగా మూడు వికెట్లు తీశాడు.ఓపెనర్లు ఇన్నోసెంట్ కయా (4: 20 బంతుల్లో)ఇంకా తదివనాషే మరుమని (8: 22 బంతుల్లో, ఒక ఫోర్), వెస్లీ మదెవెరెలను (5: 12 బంతుల్లో) దీపక్ చాహర్ వెనక్కి పంపాడు.


అలాగే మధ్యలో షాన్ విలియమ్స్‌ను (1: 3 బంతుల్లో) మహ్మద్ సిరాజ్ ఇంకా సికిందర్ రాజా (12: 17 బంతుల్లో, ఒక ఫోర్), ర్యాన్ బుర్ల్‌లను (11: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) ప్రసీద్ కృష్ణ అవుట్ చేశారు.ఇక కాసేపు పోరాడిన కెప్టెన్ రెగిస్ చకాబ్వా (35: 51 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఇంకా లూక్ జోంగ్వే (13: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుట్ అయ్యారు. దీంతో జింబాబ్వే మొత్తం 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఇక ఈ దశలో టెయిలెండర్లు బ్రాడ్ ఎవాన్స్ (33: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) ఇంకా రిచర్డ్ ఎంగార్వా (34: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) జింబాబ్వేను ఆదుకున్నారు. వీరు తొమ్మిదో వికెట్‌కు మొత్తం 70 పరుగులు జోడించడం విశేషం. ఈ ద్వయం భారత బౌలర్లను ఎంతో సమర్థంగా ఎదుర్కొంది.ఇక ఎంగార్వా అవుటయ్యాక... 11వ నంబర్ బ్యాటర్ ఎన్యావుచి (8: 6 బంతుల్లో, ఒక ఫోర్) కూడా వెంటనే అవుట్ కావడంతో జింబాబ్వే టోటల్ గా 189 పరుగులకే ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసీద్ కృష్ణ ఇంకా అక్షర్ పటేల్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక మహ్మద్ సిరాజ్‌కు ఒక్క వికెట్ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: