బెట్టింగ్ వెబ్ సైట్ తో ఒప్పందం.. స్టార్ ఆల్రౌండర్ కి చిక్కులు?

praveen
సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకసారి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి ఇక స్టార్ క్రికెటర్ గా ఎదిగారు అంటే చాలు రెండు చేతులా డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ఒక వైపు నుంచి ఆదాయం మరో వైపు నుంచి పేరుప్రఖ్యాతులు వాటంతట  అవే వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో స్టార్ క్రికెటర్లను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చుకునేందుకు ఎన్నో కంపెనీలు కూడా సిద్ధమవుతున్నాయి.

 ఇలాంటి సమయంలోనే ఇప్పటికే ఎంతో మంది స్టార్ క్రికెటర్లూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తద్వారా కోట్ల రూపాయల సంపాదన అర్జీస్తున్నారు. అయితే క్రికెటర్లు  వాణిజ్య ప్రకటన చేసుకోవడంలో కాస్త స్వేచ్ఛ ఉన్నప్పటికీ కొన్ని కొన్ని వాణిజ్య ప్రకటనల విషయంలో మాత్రం క్రికెటర్లకు అస్సలు అనుమతి ఉండదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బెట్టింగ్ కు సంబంధించిన కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలు పెట్టుకోకూడదు. ఇలాంటి ఒప్పందాలు ఏవైనా పెట్టుకుంటే కెరీర్ ప్రమాదంలో పడిపోతుంది అని చెప్పాలి.

 ఇప్పుడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కెరియర్ కూడా ఇలాగే చిక్కుల్లో పడింది అని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్గా కొనసాగుతున్నాడు షకీబ్ ఆల్ హాసన్. ఈ క్రమంలోనే ఇటీవలే బెట్టింగ్ వెబ్సైట్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెరమీదకు రావడంతో సదర్ స్టార్ క్రికెటర్ చిక్కుల్లో పడిపోయాడు అని చెప్పాలి.  బెట్టింగ్ అనేది అనైతిక చర్య అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నాజ్ మూల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ కు సంబంధమైన ఏ కంపెనీ తోనూ క్రికెటర్లు సంబంధాలు పెట్టుకోకూడదు అంటూ స్పష్టం చేశారు. కాగా వివరణ ఇవ్వాలి అంటూ షకీబ్ ఉల్ హాసన్ కి నోటీసులు పంపినట్లు తెలిపారు. ఒకవేళ బెట్టింగ్ వెబ్సైట్ తో అతనికి సంబంధాలు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: