ఒకప్పుడు ధోనీతో కలిసి ఆడాడు.. కానీ ఇప్పుడు బస్సు డ్రైవర్ గా?

praveen
ఓడలు బండ్లు .. బండ్లు ఓడలు అవుతాయి అని ఒక సామెత ఉంది. కాలం కలిసి రాకపోతే ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది అన్నది ఇప్పటికీ ఎంతోమంది  విషయంలో రుజువయింది అని చెప్పాలి. మనం మాట్లాడుకునే క్రికెటర్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు గొప్పగా బతుకుతున్నాం రేపు భవిష్యత్తులో ఎలాంటి కష్టం రాదు అనుకుంటే మాత్రం అందరూ తెలియకుండానే తప్పు చేసినట్లు అవుతుంది అన్నది ఇక ఈ మాజీ క్రికెటర్ చూస్తే అర్థమవుతుంది.

 ఒక్కసారి ఐపీఎల్ లో సెలెక్ట్ అయితే చాలు ఇక ప్రతి క్రికెటర్ జీవితం మొత్తం మారిపోతుంది. ఫైనాన్సిల్ ప్రాబ్లంస్ తీరిపోతాయి. కోట్ల రూపాయలు సంపాదించి లగ్జరీ లైఫ్ కి అలవాటుపడి పోవచ్చు. ఇక జీవితంలో తిరుగు ఉండదు అని అందరూ అనుకుంటారు. అయితే ఎక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ తో కలిసి ఆడిన ఒక ప్లేయర్ మాత్రం ఇక ఇప్పుడు బస్సు డ్రైవర్ గా మారిపోయాడు. అతను ఎవరో కాదు  శ్రీలంక స్పిన్నర్ సూరజ్ రణ్ దీవ్.  ఇతను లంక జాతీయ జట్టులోకి వచ్చాడు. 2011 వన్డే ప్రపంచకప్ లో కూడా ఆడాడు. తుది జట్టులో కూడా అవకాశం దక్కించుకున్నాడు.

 2011, 12 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ధోనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ కూడా షేర్ చేసుకున్నాడు. కెరియర్ లో చివరిసారిగా శ్రీలంక తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు. క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. రణదీవ్ విషయంలో మాత్రం అలా జరగలేదు.  రిటైర్మెంట్ తర్వాత పొట్టకూటికోసం ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాడు. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడం కోసం బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇక ఈ క్రికెటర్  కష్టం గురించి తెలిసి అందరి మనసు తరుక్కు పోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: