ఐపీఎల్లో ఆడతారు.. టీమిండియాలో ఆడరా : సునీల్ గవాస్కర్
ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఎందుకు బీసీసీఐ ఇలా వరుసగా ఆటగాళ్లకు విశ్రాంతినిస్తుంది అన్న చర్చ కూడా తెర మీదికి వస్తుంది. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం పై తప్పుపట్టాడు సునీల్ గవాస్కర్. ఇటీవలే ఓ క్రీడా ఛానల్ తో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. ఆటగాళ్లు అటు టీమ్ ఇండియా మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకోవడం అనేది నేను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించను. ఎందుకంటే బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విశ్రాంతి లేకుండా టోర్నీ మొత్తం ఆడే వీళ్ళకి.. టీమిండియాకు ఆడేటప్పుడు మాత్రం విశ్రాంతి కావాలా అంటూ ప్రశ్నించాడు సునీల్ గవాస్కర్.
వీళ్లు ఆడేది భారత జట్టుకు.. అలాంటప్పుడు విశ్రాంతి గురించి అస్సలు మాట్లాడకూడదు. టి20 క్రికెట్ లో 20 ఓవర్లు ఉంటాయి. ఆ మ్యాచ్లు ఆడిన అంతమాత్రాన శారీరక శ్రమ అంతగా పెరిగి పోదు. ఒక ఆటగాడి పై శారీరక శ్రమ పెరిగిపోవడం కేవలం టెస్ట్ క్రికెట్ లో మాత్రమే జరుగుతుంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఆటగాళ్లు మనస్సు శరీరంతో ఆడాల్సి ఉంటుంది. కానీ పొట్టి ఫార్మాట్లోనూ అలాంటి సమస్యలు ఏమీ ఉండవు.. అందుకే జట్టులో ఉన్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఇక ఈ మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు కాస్త అందరిని ఆలోచనలో పడేసాయి.