కోహ్లీ ఫామ్ పై.. పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?

praveen
విరాట్ కోహ్లీ గత కొంత కాలం నుంచి పేలవ ఫామ్ లో కొనసాగుతూ టీమిండియాకు భారంగా మారి పోతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గొప్ప ఆటగాడు అన్న కారణంతో అటు బిసిసిఐ  అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ అతను మాత్రం అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. అన్ని మ్యాచ్లలో కూడా తక్కువ పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ప్రదర్శన పై విమర్శలుచేస్తున్న మాజీ ఆటగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.

పేలవా ప్రదర్శన నేపథ్యంలో విరాట్ కోహ్లీ  స్థానం రోజురోజుకు డేంజర్ జోన్లో పడిపోతుంది.  ఇలాంటి సమయంలోనే స్పందిస్తూ ఉన్న మాజీ ఆటగాళ్లు విరాట్ కోహ్లిని జట్టు నుంచి పక్కన పెట్టాలని డిమాండ్ తెరమీదికి తెస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా కూడా చేరిపోయాడు. విరాట్ కోహ్లీ పేలవా ఫాం పై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు డానిష్ కనేరియా. టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ ఈ మధ్య యువ ఆటగాళ్లే తలో చేయి వేసి జట్టుని గెలిపించుకుంటున్నారు. మొన్నటి వరకు జట్టును విజయతీరాలకు వైపు నడిపిన విరాట్ కోహ్లీ ఇప్పుడు భారంగా మారిపోయాడు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం విరాట్ కోహ్లీ అతని స్థానాన్ని వేరే వాళ్లకు ఇవ్వాలి లేదా కొద్ది రోజులు దూరంగా ఉండాలి. టి20 ప్రపంచ కప్ ముందైనా జట్టులో చేరాలి. విరాట్ కోహ్లీ పరుగులు సాధిస్తాడని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. అతడు ఈసారి ఐపీఎల్లో ఆడకుండా ఉండాల్సింది. నేను ముందునుంచి చెబుతున్నాను ఐపీఎల్లో ఆడకుండా అతను విశ్రాంతి తీసుకోవలసి ఉండేది. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు అందరూ ప్రపంచకప్ కోసం సన్నద్ధం అవుతూ ఉంటే కోహ్లీ మాత్రం రోజురోజుకీ  జట్టుకు భారంగా మారిపోతున్నాడు అంటూ డానిష్ కనేరియా  కోహ్లీ పేలవమైన ఫాం పై కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: