విధ్వంసం అంటే ఇది.. 17 బంతుల్లో ఎన్ని పరుగులు చేశాడో తెలుసా?
ఇక ఇప్పుడు ఇలాంటి ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. బ్యాటింగ్ విధ్వంసం అంటే ఏంటో ఒక రేంజిలో చూపించాడు ఇక్కడ ఒక ఆటగాడు. జట్టులోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి బంతిని ఉతికి ఆరేస్తూ వచ్చాడు. కేవలం 17 బంతుల్లోనే 76 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు ఇంగ్లాండ్ ఆటగాడు ఆడం హోస్. టీ20 బ్లాస్ట్ లో భాగంగా ఈ అద్భుతమైన ప్రదర్శన చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఇంగ్లండ్ వేదికగా టీ20 బ్లాస్ట్ లో మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.
ఇటీవలే టీ20 బ్లాస్ట్ లో భాగంగా వొర్సెస్టర్ షైర్, బర్మింగ్హామ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన బర్మింగ్హామ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇక ప్రత్యర్థి జట్టు 84 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో బర్మింగ్హామ్ 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట్లోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది బర్మింగ్హామ్ జట్టు. ఆ సమయంలోనే క్రీజులోకి వచ్చాడు ఆడం హోస్. 17 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇక మొత్తంగా 53 బంతుల్లో 110 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగానే బర్మింగ్హామ్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.