
కొన్ని సార్లు మౌనమే బెటర్ : మిథాలీ
ఇక ఈ విషయం బిసిసిఐ పెద్దల వరకు వెళ్ళింది అని చెప్పాలి. ఇక అప్పట్లో వీరు ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. కాగా ఇటీవలే జాతీయ మీడియా తో మాట్లాడిన మిథాలీ రాజ్ కోచ్ రమేష్ తో ఉన్న వివాదం ఎలా సద్దుమణిగింది అన్ని విషయాలు చెప్పు కొచ్చింది. మనం చిక్కుల్లో ఉన్నప్పుడు సమర్థవంతం గా ఆలోచించలేమూ అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోకున్నా ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటామూ.
అయితే కొన్ని కొన్ని సార్లు వివాదాల విషయం లో మౌనం గా ఉండడమే బెటర్ అని మిథాలీ రాజ్ చెప్పు కొచ్చింది. మనపట్ల ఎవరైనా పక్షపాతం చూపించినప్పుడు దాన్ని స్వీకరించడానికి ఎంతో ధైర్యం కావాలి. ప్రతి ఒక్కరికి అప్పుడు ఏం జరిగింది అనేది తెలుస్తూ ఉంటుంది. నేను ఆట పట్ల అంకిత భావంతో ఉన్నా కాబట్టి ఆ వివాదాన్ని వదిలేశాను. ఆ సమయంలో మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాను. అందుకే ఆ వివాదం గురించి బాధ పడకుండా వదిలేశాను అంటూ మిథాలీ రాజ్ చెప్పుకొచ్చింది..