అదృష్టం అంటే ఇదే.. ముగ్గురు ఫీల్డర్లు వచ్చినా?

praveen
క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా   జరుగుతున్న సమయంలో కొన్నిసార్లు క్రికెటర్లకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వికెట్ కోల్పోయాము అని ఆటగాళ్ళు ఫిక్స్ అయిపోయి పెవీలియన్ వైపు వెళ్తూ ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి వికెట్ సేవ్ అవుతూ ఉంటుంది. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ కోల్పోయిన  నిరాశతో ఉన్న సమయంలో నో బాల్ అని తేలడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.

 ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు టీమ్ ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది అనేది తెలుస్తుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌత్ఆఫ్రికాపై మొదట టీమిండియా బ్యాట్స్మెన్ లు వీర విహారం చేస్తూ మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చారు. అయితే సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు మాత్రం ఎంతో విలువైన క్యాచ్ లను జారవిడిచటం గమనార్హం. అయితే జోరు మీద ఉన్న ఇషాన్ కిషన్ 53 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

 కేశవ్ మహరాజ్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ బ్యాక్వర్డ్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. అయితే ఆ క్యాచ్ అందుకోవడానికి ఒకేసారి ముగ్గురు ఫీల్డర్లు  అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ ముగ్గురు ఫీల్డర్ల మధ్య సమన్వయ లోపం కనిపించింది.  దీంతో ఒకరు క్యాచ్ అందుకుంటారని  మరొకరు చివరికి క్యాచ్ నేలపాలు చేశారు. దీంతో వికెట్ పోయింది అనుకున్న ఇషాన్ కిషన్ కు అదృష్టం కలిసిరావడంతో ఆ తర్వాత మరో 23 పరుగులు చేశారు వికెట్ కోల్పోయాడు. అయితే ఈ మ్యాచ్లో సౌత్ఆఫ్రికా విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: