ముంబై ఇండియన్స్ నెక్స్ట్ కెప్టెన్.. తిలక్ వర్మ?

praveen
తెలుగు తేజం తిలక్ వర్మ.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఇతని పేరు మార్మోగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు అతని ఏకంగా 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఒక యువ ఆటగాడికి ముంబై ఇండియన్స్ ఇంత ధర పెట్టడం ఏంటి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఐపీఎల్ లోకి వచ్చిన తర్వాత ముంబై ఇండియన్ జట్టులో  చేరి అతను రాణించిన తీరు చూసిన తర్వాత అతనికి 1.7 కోట్ల రూపాయలు తక్కువే అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఆ రేంజ్ లో అతని ఆటతీరు ఉంది అని చెప్పాలి.

 ఒకవైపు ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఓటమి పాలు అవుతూ ఉన్నప్పటికీ అటు తిలక్ వర్మ మాత్రం తన పని తాను చేసుకుంటూ దూసుకుపోయాడు. ప్రతి మ్యాచ్ లో కూడా మంచి పరుగులు చేశాడు. ఇక కొన్ని మ్యాచులలో అతని దూకుడైన ఆటను చూసిన తర్వాత యువరక్తం కదా అలాగే ఉరకలు వేస్తుంది అనుకున్నారు. కానీ ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ ఆడిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి. ఎక్కడ అనాలోచిత షాట్లు ఆడకుండా పరిణితి చెందిన క్రికెటర్గా జట్టుకు అవసరమైన సమయంలో ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించాడు.

 ఈ క్రమంలోనే అతని టెంపర్  లెస్ ఆట ఎంతో బాగుంది అంటూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రశంసలు కురిపించాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం తిలక్ వర్మ పై ప్రశంసలు కురిపించాడు. మొదటి మ్యాచ్ నుంచి తిలక్ వర్మ అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతి సారి కూడా బాధ్యతలు భుజాలపై వేసుకున్నాడు. ఏమాత్రం కొత్త ఆటగాడిలా అతను కనిపించడంలేదు.  ముంబై ఇండియన్స్ కి దీర్ఘకాలంపాటు సారథ్యం వహించే సత్తా అతనికి ఉంది. నాకు తెలిసి ముంబై ఇండియన్స్ నెక్స్ట్ కెప్టెన్ అతడే అంటు హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: