తన బౌలింగ్ పై.. ఉమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు?
మరీ ముఖ్యంగా హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో అటు ఉమ్రాన్ మాలిక్ ప్రతి మ్యాచ్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అని చెప్పాలి. బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ అటు ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిస్తు ఉన్నాడు. మెరుపువేగంతో బంతులను విసురుతూ ఏకంగా కీలక సమయంలో వికెట్లు తీస్తూ ఉన్నాడు. ఇక ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్ ఏకంగా అయిదు వికెట్ల హాల్ సాధించాడు అని చెప్పాలి. దీంతో అందరూ అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇకపోతే ఇటీవల తన బౌలింగ్ ప్రణాళికపై ఉమ్రాన్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లైన్ అండ్ లెంగ్త్ కు తో ఫాస్ట్ బౌలింగ్ వేసి వికెట్లు పడగొట్టడం తన ప్రణాళిక అంటూ చెబుతున్నాడు ఉమ్రాన్ మాలిక్. వాంఖడే స్టేడియం కాబట్టి స్టంప్స్ లక్ష్యంగానే చేసుకొని బౌలింగ్ వేసాను అంటూ తెలిపాడు. 155 కిలోమీటర్ల స్పీడ్ తో బంతిని ఎప్పుడు వేస్తారు అని అడిగిన ప్రశ్నకు దేవుడు సంకల్పిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా 155 కిలోమీటర్ల వేగంతో బంతిని వేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా సన్రైజర్స్ వరుస విజయాలు సాధించడం లో అటు ఉమ్రాన్ మాలిక్ పాత్ర కూడా కీలకం గా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.