రషీద్ ఖాన్ ఇగో హర్ట్.. ప్రతీకారం తీర్చుకున్నాడు?

praveen
అందరూ అనుకున్నట్లుగా రషీద్ ఖాన్ పెద్ద వికెట్ టేకర్ ఏమీ కాదు అతనికి మించిన బౌలర్లు సన్రైజర్స్ లో చాలామంది ఉన్నారు. అతను లేకపోయినా ప్రస్తుతం సన్రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. రషీద్ ఖాన్ సన్ రైజర్స్ కి అవసరం లేదు అన్నదానికి మా జట్టు విజయాలే నిదర్శనం అంటూ సన్రైజర్స్ బ్యాటింగ్ కోచ్ బ్రయన్ లారా గుజరాత్ టైటాన్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగడానికి ముందు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎందుకో ఈ కామెంట్స్ అటు రషీద్ ఖాన్ కి మాత్రం నచ్చలేదు అన్నది తెలుస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలను తిప్పికొట్టాలి అంటే మాటలతో కాదు తన ఆటతోనే చూపించాలి అనుకున్నాడో ఏమో..  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర వహించాడు.

 ఎంతో ఉత్కంఠ భరితంగా గుజరాత్ సన్రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చివరి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి విజయఢంకా మోగించింది. ఆఖరి ఓవర్లో విజయానికి 22 పరుగులు అవసరం అయిన సమయంలో రషీద్ ఖాన్ సిక్సర్ల మోత మోగించాడూ. ఇక ఒక దశలో మ్యాచ్ మొత్తం సన్రైజర్స్ వైఫై  ఉంది కానీ రషీద్ ఖాన్ వచ్చిన తర్వాత మాత్రం మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. అప్పటికే 21 బంతుల్లో 40 పరుగులు చేసి దాటిగా ఆడుతున్నాడు రాహుల్ తేవాటియా.. అంతలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ 11 బంతుల్లో నాలుగు సిక్సర్లు సాయంతో 31 పరుగులు చేశాడు.

 అయితే ఇక రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ చూసిన తర్వాత కొంతమంది ఐపీఎల్ అభిమానులు ఆసక్తికర కామెంట్ చేస్తూ ఉన్నారు. సన్రైజర్స్ బ్యాటింగ్ కోచ్ బ్రయాన్ లారా రషీద్ ఖాన్ ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలతో అతనికి ఈగో హర్ట్ అయింది. అందుకే సన్రైజర్స్ లో జరిగిన మ్యాచ్లో 11 బంతుల్లో నాలుగు సిక్సర్లతో 31 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు అని ఇలా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రషీద్ ఖాన్ ప్రతీకారం తీర్చుకున్నాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: