ఢిల్లీ జట్టుకు గుడ్ న్యూస్.. ఇక తిరుగుండదు అంతే?
జట్టులో ఉన్న ఆటగాళ్లతో పాటు పలువురు సిబ్బంది కూడా వైరస్ బారిన పడటంతో ఇక కీలకమైన బౌలర్లు అటు ఢిల్లీ కాపిటల్ జట్టుకు దూరం అయ్యారు. ఇక ఆ తర్వాత అటు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీపాంటింగ్ కుటుంబంలో ఒకరు వైరస్ బారిన పడటంతో అతన్ని కూడా జట్టుకు కు దూరంగా క్వారంటైన్ కి మాత్రమే పరిమితం చేశారు అన్న విషయం తెలిసిందే. కాగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఇక ఈ మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఒక అదిరిపోయే శుభవార్త అందింది.
కరోనా వైరస్ బారినపడి జట్టుకు దూరమైన ఆస్పత్రి పాలైన ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు అనేది తెలుస్తుంది. ఇక ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అనంతరం అతను కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇక ఇప్పుడు మళ్లీ జట్టులోకి రాబోతున్నాడు. అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రెండు మ్యాచ్లు ఆడిన మరో టీమ్ సిఫర్డ్ కరోనా వైరస్ నుంచి విముక్తి పొందాడు అని తెలుస్తోంది. వీరిద్దరు కూడా ఇటీవలే ప్రాక్టీస్ స్పెషల్ లో పాల్గొన్నారు. నేరుగా ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడబోయే మ్యాచ్లో జట్టుతో చేరి అమీతుమీ తేల్చుకోనుంది..