కోహ్లీ.. ఏంటిది.. మళ్లీనా?

praveen
ఏంటి కోహ్లీ ఇది.. ఇలా ఆడటం నీకేమైనా సరదా అనిపిస్తుందా.. ఎప్పుడు రికార్డులు కొల్లగొట్టే నీవు ఇప్పుడు రోజురోజుకీ జట్టుకు భారంగా మారి పోతున్నావ్ అర్థం కావడం లేదా.. ఇప్పటికైనా తేరుకో కోహ్లీ  ఎన్నాళ్ళు ఈ పేలవ ప్రదర్శన.. చూడలేకపోతున్నాం.. ప్రస్తుతం కోహ్లీ పేలవ పై  ప్రతి అభిమాని ఇలాగే అనుకుంటూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కోహ్లీ రాణిస్తాడు భారీగా పరుగులు చేస్తాడు విమర్శకుల నోళ్లు ముగిస్తాడు అని అభిమానులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ కోహ్లీ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా పేలవ ప్రదర్శనతో ఉసూరుమనిపిస్తూ ఉన్నాడు.


 దీంతో ఎవరో విమర్శలు చేయడం కాదు ఏకంగా కోహ్లీ అభిమానులే విమర్శలు చేయడం మొదలు పెడుతున్నారు. గత కొంతకాలం నుంచి ఎక్కువ పరుగులు చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్న కోహ్లీ కనీసం వికెట్ కూడా కాపాడుకోలేక పోతున్నాడు. భారీ అంచనాల మధ్య క్రీజులోకి రావడం గోల్డెన్ డకౌట్ గా పెవీలియన్ చేరటం చేస్తున్నాడు. ఇటీవలే ఏప్రిల్ 19వ తేదీన లక్నో జట్టుతో ఆర్సిబి ఆడిన మ్యాచ్ లో కూడా కోహ్లీ ఇదే ఆటతీరును కొనసాగించాడు. ఒక పరుగు కూడా చేయకుండానే ఔటయ్యి వెనుతిరిగాడు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు.


 కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాత్రం కోహ్లీ మళ్లీ పుంజుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ అసలు ఏ అనుభవములేని ఓ యువ ఆటగాడు కంటే దారుణం గా ఆడాడు. మరోసారి మొదటి బంతికే వికెట్  సమర్పించుకొని గోల్డెన్ డక్ ఔట్ కావడం గమనార్హం. మార్కో జాన్సన్ వేసిన ఓవర్లో అనవసరమైన  షాట్ ఆడేందుకు ప్రయత్నించి చివరికి మార్కరం కి క్యాచ్ ఇచ్చాడు.  ఇక ఇది చూసిన తర్వాత కోహ్లీ మళ్లీనా ఇక నువ్వు మారవా అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: