ఐపీఎల్ ఫైనల్.. క్రేజీ న్యూస్ చెప్పిన బిసిసీఐ?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ మాట వినిపించింది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకుల్లో కొత్త ఉత్తేజం నిండి పోతూ ఉంటుంది. ప్రతి ఏడాది జరిగే రెగ్యులర్ టోర్నీ అయినప్పటికీ ప్రతి సారి సరికొత్త రీతిలో ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని ప్రతీ మ్యాచ్ ని కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు  ప్రేక్షకులు. అదే సమయంలో ఇక ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా చివరి వరకు ఎవరు విజయం సాధిస్తారో తెలియని విధంగానే మారిపోయింది.

 అంతేకాకుండా ఈ ఐపీఎల్ లో ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రేక్షకుల అంచనాలకు అందడం లేదు అని చెప్పాలి. దీంతో ఇక ప్రతి మ్యాచ్ కన్నార్పకుండా వీక్షిస్తున్నారు ఐపీఎల్ ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం లీగ్ మ్యాచ్లు ఎంతో రసవత్తరంగా సాగిపోతూ ఉన్నాయి. ఇక ప్లే ఆఫ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని జట్లు కూడా హోరాహోరీగా మైదానంలో తలపడుతూ ఉండటం గమనార్హం. అయితే ఇప్పటి వరకు లీగ్ మ్యాచ్ లు ఎక్కడ జరుగుతాయి అన్న విషయాన్ని ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఐపీఎల్ అభిమానులందరికీ కూడా బిసిసీఐ ఒక ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదికను ఖరారు చేసింది. మే 27వ తేదీన వరకు  ప్లే ఆఫ్ మ్యాచ్ లతోపాటు మే 29వ తేదీన అహ్మదాబాద్ వేదికగా ఇక ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని బీసీసీఐ తెలిపింది. అంతేకాదు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఈ ఫైనల్ మ్యాచ్ కి అటు 100% ప్రేక్షకులను అనుమతించ పోతున్నాము అంటూ వెల్లడించింది. తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ మే 24, ఎలిమినేటర్ మ్యాచ్ మే 26 కోల్కతా వేదికగా నిర్వహించబోతున్నట్లు తెలిపింది బీసీసీఐ. మహిళల టి20 లీగ్ ఉమెన్స్ చాలెంజర్ మే 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: